Sunday, September 8, 2024
Homeసినిమార‌వితేజ ‘ఖిలాడి’కి ఫ్యాన్సీ ప్రీ రిలీజ్ బిజినెస్

ర‌వితేజ ‘ఖిలాడి’కి ఫ్యాన్సీ ప్రీ రిలీజ్ బిజినెస్

Khiladi business: మాస్ మహరాజా రవితేజ,  దర్శకుడు పెన్మత్స రమేష్ వర్మ కాంబినేషన్‌లో రూపొందుతోన్న యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్ ‘ఖిలాడి’. కొనేరు స‌త్య‌నారాయ‌ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రీసెంట్‌గా రాక్ స్టార్ దేవిశ్రీ ప్ర‌సాద్ సంగీత సార‌థ్యం నుంచి వెలువ‌డిన పాట‌ల‌కు చాలా మంచి ఆద‌ర‌ణ దక్కాయి. ఫిబ్ర‌వ‌రి 11న మూవీ రిలీజ్ అవుతుంది. ఈ సంద‌ర్భంగా సినిమా థియేట్రిక‌ల్‌, నాన్ థియేట్రిక‌ల్ హ‌క్కుల‌కు సంబంధించి ఫ్యాన్సీ రేట్స్‌ కు ప్రీ రిలీజ్ బిజినెస్ జ‌రిగింది. ర‌వితేజ గ‌త చిత్రాల కంటే ఈ సినిమాకు ఎక్కువ బిజినెస్ జ‌రిగిన‌ట్లు ట్రేడ్ వ‌ర్గాలు అంటున్నాయి.

స్టైలిష్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందుతోన్న ‘ఖిలాడి’ చిత్రంలో మీనాక్షి చౌద‌రి, డింపుల్ హ‌య‌తి హీరోయిన్స్‌గా న‌టించారు. పెన్ స్టూడియోస్ బ్యాన‌ర్ తో పాటు ఏ స్టూడియోస్ బ్యాన‌ర్స్ ఈ చిత్రాన్ని నిర్మించారు. సుజిత్ వాసుదేవ్‌, జి.కె.విష్ణు సినిమాటోగ్రాఫ‌ర్స్‌గా వ‌ర్క్ చేశారు. శ్రీకాంత్ విస్సా, దేవిశ్రీ ప్ర‌సాద్ సోద‌రుడు సాగ‌ర్ ఈ చిత్రానికి డైలాగ్స్ రాశారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్