Monday, July 8, 2024
HomeTrending Newsఅమరావతిని శరవేగంగా పూర్తి చేస్తాం: బాబు

అమరావతిని శరవేగంగా పూర్తి చేస్తాం: బాబు

అమరావతిలో ప్రస్తుతం ఉన్న శిథిలాల నుంచే బంగారు భవిష్యతుకు నాంది పలుకుతామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు.  తాను 45 ఏళ్ళ నుంచి రాజకీయాల్లో ఉన్నానని కానీ రాజధానిని మార్చిన వ్యక్తి గతంలో ఎవరూ లేరని, జగన్ మాత్రమే కక్ష సాధింపుతో ఈ పని చేశారని… రాజధాని మార్పు జరిగితే ఏమవుతుందనేది దేశాని కేస్ స్టడీ  అవుతుందన్నారు. ఏం జరిగినా వెనక్కి చూడబోనని, ముందుకే వెళ్తామని.. న్యాయపరమైన చిక్కులు తొలగించి పనులు శరవేగంగా పూర్తి చేస్తామని వెల్లడించారు. నేడు రెండో అంశంగా అమరావతిపై  చంద్రబాబు శ్వేతపత్రం విడుదల చేశారు.

బాబు ప్రసంగంలోని ముఖ్యాంశాలు:

  • విభజన సమయంలో మనకు లోటు బడ్జెట్ ఉంది,  ఏ ప్రాజెక్టు ఏదైనా విన్ విన్ పరిస్థితిలోనే ముందుకు తీసుకెళ్లాలని నిర్ణయించాం
  • ప్రపంచంలోనే అతిపెద్ద భూసేకరణ ప్రాజెక్టు. అమరావతి కోసం 29 వేల మంది రైతులు 34,400 ఎకరాలు ఇచ్చారు
  • రైతులు ఇచ్చింది, ప్రభుత్వ భూమి కలిపి 53,745 ఎకరాలు చేకూరాయి
  • రైతులు ఇచ్చిన భూమికి ఏటా పరిహారం ఇచ్చాం, పదేళ్ల వరకు పరిహారం ఇస్తామని రైతులకు చెప్పాం
  • రాజధాని రాష్ట్రానికి నడిమధ్యనే ఉండాలని జగన్ చెప్పారు, అధికారంలోకి వచ్చాక జగన్ ఏం చేశారో ప్రజలే చూశారు
  • అమరావతిలో పెట్టుబడులు పెట్టేందుకు అనేకమంది ముందుకు వచ్చారు
  • సింగపూర్.. మనకు మాస్టర్ ప్లాన్ ఇచ్చింది
  • తొమ్మిది విభాగాల్లో అమరావతి హబ్‍గా మారాలని ఆకాంక్షించాం
  • జగన్ వచ్చాక అమరావతిలో జరుగుతున్న పనులను ఆపేశారు, జగన్ వచ్చిన వెంటనే ప్రజావేదిక కూల్చేశారు, ఏ కట్టడం కూల్చాలన్నా పదిసార్లు ఆలోచిస్తాం
  • అమరావతి రైతులను అనేక రకాలుగా అవమానించారు
  • భూమి ఇచ్చిన రైతులు రోడ్డుపై పడ్డారు, శ్రీకాకుళం యాత్రకు వెళ్తే మధ్యలోనే అడ్డగించారు
  • అమరావతి రైతుల త్యాగం చరిత్ర గుర్తుపెట్టుకుంటుంది
  • ప్రపంచ ప్రసిద్ది చెందిన సింగపూర్ కన్సార్టియాన్ని రద్దు చేశారు
  • రూ.720 కోట్ల ప్రాజెక్టు హ్యాపీ నెస్ట్ ను నిలిపివేశారు – దీనిలో ఇప్పుడు రూ.165 కోట్ల నష్టం వచ్చింది
  • నాడు గంట వ్యవధిలోనే అమరావతి బాండ్లు అమ్ముడయ్యాయి, కానీ ఐదేళ్ళ పాలనలో విశ్వసనీయత దెబ్బతిని పెట్టుబడిదారులు వెనక్కి వెళ్లిపోయారు
  • అమరావతి నుంచి ఉపాధి కోసం ఇతర ప్రాంతాలకు వలస వెళ్లారు
  • అమరావతిలో భవనాలు, నిర్మాణ సామగ్రి పాడయ్యాయి
  • జగన్ ప్రభుత్వ అరాచక పనుల వల్ల అమరావతి ధ్వంసమైంది
  • ఎమ్మెల్యేలు, ఐఏఎస్‍లు, జడ్జిలకు క్వార్టర్స్ కట్టాం, గెజిటెడ్ అధికారులకు కూడా క్వార్టర్స్ నిర్మించాం
  • భవనాలు, నిర్మాణాల పరిసరాల్లో పిచ్చిమొక్కలు మొలిచాయి
  • మన రాష్ట్రంలో అవకాశాలు లేవా.. ప్రజలకు తెలివితేటలు లేవా
  • మన రాష్ట్రం రైస్ బౌల్ అని దేశవ్యాప్తంగా పేరుంది – మనకు మంచి భూములు ఉన్నాయి. పండించే రైతులు ఉన్నారు
  • ఇంతగా విధ్వంసం చేసిన వ్యక్తి జగన్ రాజకీయాలకు అర్హుడేనా? విభజన తర్వాత ఇబ్బందులున్నా నిలదొక్కుకోవాలని చర్యలు చేపట్టాం
  • అమరావతికి మళ్లీ బ్రాండ్ ఇమేజ్ ఎలా తేవాలనే ఆలోచిస్తున్నాం
  • ఇప్పుడు పెట్టుబడిదారులను రప్పించాలంటే చాలా కష్టపడాలి
  • మళ్లీ ఇబ్బందులు రావని భరోసా ఏమిటని అడుగుతున్నారు?
  • ఇక్కడ సంపద సృష్టి, ఉపాధి కల్పన, పేదరిక నిర్మూలన జరగాలి
  • అమరావతిలో అభివృద్ధి కొనసాగితే భూమి రేట్లు బాగా పెరిగేవి
  • రూ.50 వేల కోట్లు ఖర్చు పెడతామని నిర్ణయించాం
  • పన్నుల రూపంలో ప్రభుత్వానికి తిరిగి నిధులు వచ్చేస్తాయి
  • విట్, ఎస్ఆర్ఎం వస్తే పేదపిల్లలు ఇక్కడే చదువుకునేవారు – కల్చరల్, నాలెడ్జ్ పంచుకుంటేనే రాష్ట్ర ప్రగతి సాధ్యం
  • విశ్వసనీయత దెబ్బతిని పెట్టుబడిదారులు వెనక్కి వెళ్లిపోయారు
  • అమరావతిలో మళ్లీ పనులు ప్రారంభమయ్యాయి
  • అమరావతిలో పనులను అంచెలంచెలుగా పూర్తి చేస్తాం
  • కేసులు ఎదుర్కొంటున్న అమరావతి రైతులకు న్యాయం చేస్తాం
RELATED ARTICLES

Most Popular

న్యూస్