Saturday, January 18, 2025
HomeTrending Newsఅప్పు మీది- భరోసా మాది

అప్పు మీది- భరోసా మాది

Corporate Educational Institutions Started A New Trend By Providing Loans For Fee Payment : 

అప్పిచ్చువాడు వైద్యుడు అనేవారు గతంలో. కార్పొరేట్ వైద్యం అది నిజమని నిరూపిస్తోంది. ఇప్పుడీ నానుడి ఇంకాస్త మార్చి అప్పిచ్చువారు కార్పొరేట్ కాలేజీ వారు కూడా అనాలేమో! ఎవరినుంచి ఎవరు స్ఫూర్తి పొందుతున్నారో తెలియదు గానీ జనాల ప్రాణాలు తోడేయడంలో ఈ రెండు రంగాలు ముందుంటున్నాయి.
కరోనా దెబ్బకి విద్యావ్యవస్థ అల్ల కల్లోలమైంది. తప్పు తప్పు.. కార్పొరేట్ విద్య బాగా దెబ్బతింది. ఏ పూట కా పూట సంపాదిస్తేనే కానీ గడవని నిరుపేదలని సైతం కార్పొరేట్ ఆస్పత్రులు దోచుకుంటున్న తీరు విద్యావ్యవస్థకూ కొత్త దారి చూపుతోంది. చాలా మంది ఫీజు కట్టలేని వారిని తమ మాయలో పడేస్తోంది.

ఆ మధ్య అన్నిచోట్లా కరోనా కాలంలో కూడా ఆన్లైన్ చదువులకు లక్షల్లో ఫీజులు కట్టమని కాలేజీలు,స్కూళ్లు బెదిరించిన సంఘటనలు చదివాం. ఒక దశలో ప్రభుత్వం కూడా స్పందించాల్సివచ్చింది పాపం! మరి ఎవరు ఐడియా ఇచ్చారో గానీ పేద విద్యార్థుల జీవితాలు మరింత దిగజార్చే పథకం మొదలైంది. ఫీజులు కట్టలేమని కనికరించమని అడిగేవారిని కార్పొరేట్ కాలేజీలు బ్యాంకులకు పొమ్మంటున్నాయి. వారితో ఏం మాట్లాడుకుంటున్నారో మరి, వారే లోన్ ఇప్పించి అందులోంచి ఫీజులు దండుకుంటున్నారు. ప్రస్తుతం హైదరాబాదులో నడుస్తున్న ట్రెండ్ ఇది. మరి లోన్ తీర్చలేకపోతే …అది వారికి సంబంధం లేదు.
చదువుకోకుండానే పిల్లలు పాసవుతున్నారని సంతోషపడాలో, దానికైనా ధర చెల్లించక తప్పదనే కాలేజీల ధోరణికి బాధపడాలో తెలియక సగటు తల్లిదండ్రులు దిక్కులు చూస్తున్నారు.

–  కె. శోభ

Must Read : ఇంగ్లీషులో తెలుగు ఏడుపు

RELATED ARTICLES

Most Popular

న్యూస్