Friday, March 28, 2025
HomeTrending Newsప్రవీణ్ కుమార్ పై కేసు నమోదు

ప్రవీణ్ కుమార్ పై కేసు నమోదు

ఆర్. ఎస్ ప్రవీణ్ కుమార్ పై కేసు నమోదుకు కోర్టు ఆదేశాలు. హిందు దేవతలను ప్రతిజ్ఞ ద్వారా కించపరిచినాడని న్యాయవాది బేతి మహేందర్ రెడ్డి ఫిర్యాదు. ఈ  మేరకు ఆర్. ఎస్ ప్రవీణ్ కుమార్ పై కేసు నమోదు చేయాల్సిందిగా ప్రిన్సిపాల్ మున్సిఫ్ కోర్టు న్యాయమూర్తి సాయిసుధ కరీంనగర్ త్రీ టౌన్ పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు.

మూడు నెలల క్రితం పెద్దపల్లి జిల్లా దూళికట్టలో జరిగిన అంబేద్కర్ కార్యక్రమంలో ప్రవీణ్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కార్యక్రమ నిర్వాహకులు హిందూ దేవతలను పూజించరాదని ప్రతిజ్ఞలు చేయించటం వివాదాస్పదం అయింది. ప్రవీణ్ కుమార్ కు తెలిసే ఇదంతా జరిగిందని బిజెపి నేతలు ఆరోపణలు చేశారు. ప్రవీణ్ కుమార్ చివరకు తను హిందువునని వివరణ ఇచ్చుకోవల్సి వచ్చింది. ఈ ఘటన జరిగాక ప్రవీణ్ కుమార్ బయటకు గుంబనంగా కనిపించినా ఎంతో ఆవేదనకు గురయ్యారని సన్నిహితులు అంటున్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్