కృష్ణాజలాల వివాదాలను ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఏటీఎంలాగా వాడుకుంటున్నారని సిపిఐ జాతీయ కార్యదర్శి కె. నారాయణ విమర్శించారు. రెండు రాష్ట్రాల మధ్య తలెత్తిన జల జగడాలను తీర్చాల్సింది కేంద్ర ప్రభుత్వమేనని స్పష్టం చేశారు. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు వ్యవస్థ లనే ప్రశ్నించే స్థాయికి వెళ్ళారని నారాయణ విస్మయం వ్యక్తం చేశారు.
ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల వ్యవహరిస్తున్న తీరును గమనించి వెంటనే కేంద్రం జోక్యం చేసుకోవాలని నారాయణ విజ్ఞప్తి చేశారు. ప్రేక్షకపాత్ర వహించడం కేంద్రానికి తగదన్నారు.
కేంద్రం తీరు ఇలాగే ఉంటే అన్ని లేదంటే అన్ని రాష్ట్రాల మధ్య జలవివాదాలు వస్తాయని అయన హెచ్చరించారు. ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాల సరిహద్దుల్లో, ప్రాజెక్టుల వద్ద వద్ద పోలీసులను మోహరించారని అయన గుర్తు చేశారు. ఇది దేశ సరిహద్దుల వాతావరణాన్ని తలపిస్తోందని అయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం చోధ్యం చూడకుండా వివాదాల పరిష్కారించాలని కోరారు.