Sunday, January 19, 2025
HomeTrending Newsవెంకయ్య చొరవ తీసుకోవాలి

వెంకయ్య చొరవ తీసుకోవాలి

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను అడ్డుకోడానికి ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు చొరవ తీసుకోవాలని సిపిఐ జాతీయ కార్యదర్శి కె. నారాయణ సూచించారు. విశాఖ ఉక్కు ఉద్యమంలో, జై ఆంధ్రా ఉద్యమలో చురుగ్గా పాల్గొన్న వెంకయ్య ఇప్పుడు దేశంలోనే నెంబర్ టూ స్థానంలో ఉన్నారని, కేంద్ర ప్రభుత్వంతో ఒక్క మాట చెప్పి ఈ ప్రక్రియ ఆగేలా చూడాలని కోరారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిరసిస్తూ ఐక్యకార్యాచరణ సమితి అధ్వర్యంలో కార్మికులు చేపట్టిన రిలే నిరాహార దీక్షలు నేటికి 148వ రోజుకు చేరుకున్నాయి, నారాయణ దీక్షా శిబిరాన్నిసందర్శించి కార్మికులకు సంఘీభావం తెలియజేశారు.

ఇటీవలే మిజోరాం గవర్నర్ గా నియమితులైన కంభంపాటి హరిబాబు కూడా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని, తాను పుట్టి పెరిగిన విశాఖలో స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం జరుగుతున్న ఉద్యమాన్ని వివరించి, తాను మిజోరాం వెళ్ళాలంటే ఈ ప్రక్రియ ఆపాలని కేంద్రాన్ని కోరాలని నారాయణ డిమాండ్ చేశారు.

148 రోజులుగా ఉద్యమాలు చేస్తున్నా కేంద్ర ప్రభుత్వం దూకుడుగా వ్యవహరిస్తోంది తప్ప పునరాలోచన చేయడం లేదని విమర్శించారు.  ఇప్పటికైనా అన్ని పార్టీలు కలిసి పోరాటం ఉధృతంచేస్తే తప్ప కేంద్రం దిగివచ్చే పరిస్థితి లేదని అయన వ్యాఖానించారు.  కాగా, స్టీల్ ప్లాంట్ కార్మిక సంఘాల నేతలు నేటి నుంచి రాష్ట్రానికి చెందిన పార్లమెంట్ సభ్యులను కలుసుకొని వినతి పత్రాలు సమర్పించనున్నారు. రాబోయే పార్లమెంట్ సమావేశాల్లో దీనిపై పోరాడాలని ఎంపీలను కోరనున్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్