Narayana on Governor: ఎప్పుడూ వివాదాస్పద, సంచలన వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో ఉండే సిపిఐ జాతీయ కార్యదర్శి కె నారాయణ మరోసారి ఇలాంటి వ్యాఖ్యలు చేశారు. ఈసారి ఏకంగా ఏపీ గవర్నర్ పైనే వాగ్బాణాలు సంధించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు గవర్నర్ బ్రోకర్ గా వ్యవహరిస్తున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సిఎం జగన్ కు గవర్నర్ చప్రాసీ గా ఉన్నారని మండిపడ్డారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒక రాష్ట్రంలో అసలు గవర్నర్ స్పీచ్ లేకుండానే బడ్జెట్ సమావేశాలు మొదలయ్యాయని, మరో రాష్ట్రంలో గవర్నర్ తీరు అసహ్యంగా ఉందని ఘాటుగా విమర్శించారు.
వయసు రీత్యా పెద్దవాడైనప్పటికీ అయన చేస్తున్న పనులు చిన్నవిగా ఉన్నాయన్నారు. సీనియర్ నేతగా, మంత్రిగా అపార అనుభవం ఉన్న బిశ్వ భూషణ్ …గవర్నర్ గా వస్తే సిఎం లాంటి వారిని సెట్ రైట్ చేస్తారని తాను భావించానని, కానీ ఈయన ముఖ్యమంత్రికి హెడ్ క్లర్క్ గా మారారన్నారు. ఎన్నికల సంఘాన్ని రద్దు చేసే అధికారం ప్రభుత్వానికి లేదనిలేదని, కేవలం పార్లమెంట్ కు మాత్రమే ఉందని అలాంటిది నిమగడ్డ రమేష్ ను సస్పెండ్ చేస్తే ఆ ఫైల్ పై సంతకం చేశారని దుయ్యబట్టారు. నిబంధనలకు విరుద్ధంగా కనగారాజ్ ను నియమించారని… ఇలా అనేక వివాదాస్పద నిర్ణయాలకు ఆమోదం తెలిపారని విమర్శించారు. అసలు గవర్నర్ల వ్యవస్థను తీసేయాలన్నదే సిపిఐ విధానమన్నారు. లెజిస్లేటివ్ కౌన్సిల్ రద్దు విషయంలో కూడా ఇలాగే జరిగిందన్నారు.
Also Read : గవర్నర్ ప్రసంగం: టిడిపి నినాదాలు