Sunday, January 19, 2025
HomeTrending Newsనారాయణకు సతీ వియోగం

నారాయణకు సతీ వియోగం

Vasumathi Died: సిపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ సతీమణి వసుమతి కన్నుమూశారు. ఆమె వయసు 65 సంవత్సరాలు. కొంతకాలంగా అనారోగ్యంతో తిరుపతిలోని రుయా ఆస్పత్రిలో ఆమె చికిత్స పొందుతున్నారు. ఆరోగ్యం కుదుట పడిందని, నేడు డిశ్చార్జ్ అయ్యా అవకాశాలున్నాయని అనుకున్నారు. ఇంతలోనే ఆమె మరణవార్త నారాయణ కుటుంబ సభ్యులతో పాటు సిపిఐ  శ్రేణులను దిగ్భ్రాంతికి గురిచేసింది. బ్యాంకు ఉద్యోగిగా పనిచేసి పదవీ విరమణ చేసిన వసుమతి, పార్టీకి అనుబంధంగా ఉండే బ్యాంకు ఉద్యోగ సంఘాల్లో కీలకంగా పనిచేశారు. ఈ దంపతులకు ఒక కుమార్తె, కుమారుడు ఉన్నారు.

రేపు ఉదయం పాత చిత్తూరు జిల్లా నగరి సమీపంలోని అయినంబాకంలో వసుమతి అంత్యక్రియలు జరుగుతాయని కుటుంబ సభ్యులు వెల్లడించారు. పలు పార్టీల అధ్యక్షులు, సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి కే. రాజా వసుమతి మృతిపై సంతాపం తెలిపారు. రాజా కూడా రేపటి అంత్యక్రియల్లో పాల్గొనే అవకాశం ఉంది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్