ప్రభుత్వం చేపడుతున్న పేదల వ్యతిరేక చర్యలను నిరసిస్తూ రేపు ఛలో రాజ్ భవన్ నిర్వహిస్తున్నట్టు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడా వెంకట్ రెడ్డి తెలిపారు. కృష్ణా జలాల్లో తెలంగాణకు అన్యాయం జరిగింది కెసిఆర్ వైఫల్యం వల్లనే అని ఆరోపించారు. ప్రణాళిక లేని పనులతో అనేక ప్రాజెక్టులు పెండింగ్ ప్రాజెక్టులు గా మారిపోయాయన్నారు. కృష్ణ నికర జలాల కేటాయింపుల్లో అన్యాయం జరిగిందని ఆందోళన వ్యక్తం చేశారు.
కృష్ణా పరివాహక ప్రాంతం అంతా తెలంగాణలో ఉండగా నీటి కేటాయింపులు మాత్రం ఆంధ్రకు చెందుతున్నాయన్నారు. కెసిఆర్..జగన్ ఇద్దరు దోస్తులని చాడా ఆరోపించారు. ముఖ్యమంత్రులు ఇద్దరు జల వివాదంపై ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. రెండు రాష్ట్రాల మద్య కొట్లాట అవసరం లేదని, కలిసి మాట్లాడుకోవడమే మంచిదని అభిప్రాయపడ్డారు. సెంటి మెంట్ రగిల్చి రాజకీయాలకు కృష్ణా జలాలను వాడుకోవద్దని కెసిఆర్,జగన్ లను కోరారు. జల వివాదం మీద అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేయాలని చాడ డిమాండ్ చేశారు.