Friday, October 18, 2024
Homeసినిమా‘ఎల్‌జీఎం’ను అందరూ ఎంజాయ్ చేస్తారు - ధోని, సాక్షి

‘ఎల్‌జీఎం’ను అందరూ ఎంజాయ్ చేస్తారు – ధోని, సాక్షి

నేటి త‌రంలో ప్రేమ పెళ్లిళ్లు సాధార‌ణంగానే జ‌రుగుతున్నాయి. త‌ల్లిదండ్రులు సైతం పిల్ల‌ల అభిప్రాయాల‌కు గౌరవం ఇచ్చి ప్రేమ వివాహాల‌కు గౌర‌వం ఇస్తున్నారు. ఇలా మ‌న సంస్కృతి సాంప్ర‌దాయాల్లో వివాహానికి ఎంత ప్రాధాన్య‌త ఉందో.. కుటుంబానికి కూడా అంతే విలువ ఇస్తుంటాం. ఒక‌ప్ప‌టిలా పెద్ద కుటుంబాలు ఇప్పుడు లేవు. చిన్న కుటుంబాలు ఎక్కువ‌య్యాయి. ఇప్పుడు ప‌రిస్థితులు ఇంకా మారుతున్నాయి. ఉన్న‌టువంటి చిన్న కుటుంబాల్లోనూ మ‌న‌స్ప‌ర్ధ‌లు వ‌స్తున్నాయి. పెళ్లి చేసుకుని ఇంట్లోకి అడుగు పెట్టి అంద‌రినీ క‌లుపుకుని వెళ్లాల్సిన కోడలు.. అస‌లు అత్త‌తో నేను క‌లిసి ఉండలేనంటే ప‌రిస్థితి ఎలా మారుతుంది?  పెళ్లి చేసుకునే యువ‌కుడు ఏం చేయాలి?  చివ‌ర‌కు అత‌ని జీవితంలో జ‌రిగిన మార్పులేంటి?  ఓ వైపు త‌ల్లి, మ‌రో వైపు ప్రేయ‌సి మ‌ధ్య అత‌ను ఎలా న‌లిగిపోయాడనే విష‌యాలు తెలియాలంటే ‘ఎల్‌జీఎం’ (‘LGM’ – ‘లెట్స్ గెట్ మ్యారీడ్’) సినిమా చూడాల్సిందేన‌ని అంటున్నారు మేక‌ర్స్‌.

ఇండియ‌న్ క్రికెట్ హిస్ట్రరీలో స‌క్సెస్‌ఫుల్ కెప్టెన్ మ‌హేంద్ర సింగ్ ధోని చిత్ర నిర్మాణ రంగంలోకి అడుగు పెట్టారు. ధోని ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్‌పై LGM సినిమాను రూపొందిస్తున్నారు. త‌మిళంలో రూపొందుతోన్న ఈ చిత్రాన్ని తెలుగులోనూ విడుద‌ల చేస్తున్నారు. హ‌రీష్ క‌ళ్యాణ్‌, ఇవానా, న‌దియా, యోగిబాబు కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తెర‌కెక్కుతోన్న ఈ చిత్రాన్ని ర‌మేష్ త‌మిళ్ మ‌ణి ద‌ర్శ‌క‌త్వంలో ధోని ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్‌పై సాక్షి ధోని, వికాస్ హ‌స్జా నిర్మిస్తున్నారు. ఈ సినిమా ట్రైల‌ర్‌ను చెన్నైలో విడుద‌ల చేశారు. ఈ మూవీ ఆడియో రిలీజ్ ఫంక్షన్ చెన్నైలో జ‌రిగింది. మూవీ ట్రైల‌ర్‌ను ధోని, ఆయ‌న స‌తీమ‌ణి సాక్షి ధోని పాల్గొన్నారు.

ఈ సంద‌ర్భంగా మహేంద్ర సింగ్ ధోని మాట్లాడుతూ… ‘‘నేను సినిమా చూశాను. చాలా క్లీన్ మూవీ. చక్కటి ఎంట‌ర్‌టైన‌ర్‌. నేను నా కుమార్తెతో క‌లిసి ఎల్‌జీఎం సినిమా చూస్తాను. త‌ను నన్ను చాలా ప్ర‌శ్న‌లు వేస్తుంది. అయితే కూడా నేను త‌న‌తోనే సినిమా చూస్తాను. న‌టీన‌టులు, టెక్నీషియ‌న్స్ అద్భుతంగా వ‌ర్క్ చేశారు. చాలా మంచి టీమ్ కుదిరింది. ఈ సినిమాను నేను రూపొందించినందుకు గ‌ర్వంగా ఉంది. డైరెక్ట‌ర్ ర‌మేష్ త‌మిళ్ మ‌ణి ఓ ఆర్కిటెక్ట్ కూడా. నా భార్య సినిమా చేయాల‌ని నాతో చెప్పిన‌ప్పుడు నేను త‌న‌తో ఒకే మాట చెప్పాను. అదేంటంటే..సినిమా చేయ‌టం అంటే ఓ ఇంటిని డిజైన్ చేసిన‌ట్లు కాద‌ని. నువ్వు ఓ క‌థ‌ను ఫిక్స్ చేసుకుని, న‌టీన‌టులను కూడా ఎంపిక చేసుకో. నువ్వు ఒక్కసారి ఓకే అన్న‌త‌ర్వాత సినిమా చేస్తాన‌ని అన్నాను. అలా సినిమాను స్టార్ట్ చేశాం. మంచి టీమ్ కార‌ణంగానే త‌క్కువ స‌మ‌యంలోనే సినిమాను కంప్లీట్ చేశాం. సినిమా యూనిట్‌కు మంచి ఫుడ్ ఉండేలా చూసుకోమ‌ని చెప్పాను.

నేను విధిని న‌మ్ముతాను. నా టెస్ట్ కెరీర్ చెన్నైలోనే ప్రారంభ‌మైంది. క్రికెట్ విషయానికి వ‌స్తే హ‌య్య‌స్ట్ టెస్ట్ స్కోర్ కూడా చెన్నైలోనే సాధించాను. ఇలా చెన్నైతో నాకు మంచి అనుబంధం ఉంది. ఇక్క‌డ ప్ర‌జ‌ల ప్రేమాభిమానాలు చాలా గొప్ప‌గా ఉన్నాయి. చాలా ఒడుదొడుకుల త‌ర్వాత ఈ ఏడాది మ‌ళ్లీ మేం ఫామ్‌లోకి రావ‌టం మ‌ర‌చిపోలేని విష‌యం. సీఎస్‌కే టీమ్ ఎక్క‌డ‌కు వెళ్లినా అక్క‌డ మాకు అప‌రిమిత‌మైన ప్రేమ దొరికింది. ఇక ఎల్‌జీఎం సినిమా విష‌యానికి వ‌స్తే త్వ‌ర‌లోనే సినిమాను రిలీజ్ చేస్తాం. చాలా ఎంజాయ్ చేస్తారు. అత్త‌, కోడలు.. వారి మ‌ధ్య‌లో ఇబ్బంది ప‌డే కొడుకు ఇలా ముగ్గురు  వ్య‌క్తుల‌కు సంబంధించిన సినిమా ఇది’’ అన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్