Monday, January 20, 2025
Homeసినిమాసస్పెన్స్ క్రైం థ్రిల్లర్ ‘దారి’ కాన్సెప్ట్ పోస్టర్ రిలీజ్

సస్పెన్స్ క్రైం థ్రిల్లర్ ‘దారి’ కాన్సెప్ట్ పోస్టర్ రిలీజ్

The Way: కంటెంట్ బేస్డ్ సినిమాలకు దక్కుతున్న ఆదరణ ఎంతో మంది నూతన దర్శక నిర్మాతలకు బలాన్నిస్తోంది. కొత్త కొత్త కథలను రాసుకొని వాటిని ప్రేక్షకుల మెప్పు పొందేలా రూపొందిస్తున్నారు. ఇదే బాటలో రాబోతున్న విలక్షణ కథాంశం ‘దారి’. ముందెన్నడూ చూడని స్టోరీ లైన్ ఎంచుకొని అన్ని వర్గాల ఆడియన్స్ కనెక్ట్ అయ్యేలా కథ రాసుకొని దాన్ని ‘దారి’ అనే పేరుతో తెరకెక్కిస్తున్నారు డైరెక్టర్ యు. సుహాష్ బాబు. తాజాగా ఈ సినిమా కాన్సెప్ట్ పోస్టర్ విడుదల చేశారు.

ఫిఫ్త్ హౌస్ ప్రొడక్షన్ బ్యానర్ పై ఈ ‘దారి’ సినిమా రూపొందుతోంది. నరేష్ మామిళ్ళ, మోహన్ ముత్తిరయిల్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. పరమేశ్వర్ హివ్రాలే, కళ్యాణ్ విట్టపు, సునీత సద్గురు, సాయి తేజ గోనుగుంట్ల, అభిరామ్ (క్రేజీ అభి) ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా ఫస్ట్ కాపీ తో సెన్సార్ కి సిద్దంగా ఉంది.

ఈ భూ ప్రపంచంలో ప్రతీ జీవికి ఏదోక సమస్య, ఆ సమస్య నుండి బయట పడటానికి మన ముందు ఉండేవి మూడే దారులు. అవి పారిపోవడం, దాక్కోవడం, లేదా ఎదురుతిరగడం. దారి ఏదైనా గమ్యం మాత్రం ఒక్కటే. ఈ కథలో కూడా అయిదుగురు వేరువేరు జీవితాలకు ఎదురైన ఒకే సమస్యను ఇతివృత్తంగా తీసుకొని ప్రతి సన్నివేశంలో ప్రేక్షకులు థ్రిల్ అయ్యేలా రూపొందిస్తున్నారు. అతి త్వరలో ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్, ఇతర అప్‌డేట్స్ ఇవ్వనున్నారు మేకర్స్.

Also Read : గ్రీన్ఇండియా ఛాలెంజ్ లో పాల్గొన్న‌ సిద్దు జొన్నలగడ్డ, నేహశెట్టి

RELATED ARTICLES

Most Popular

న్యూస్