Sunday, January 19, 2025
Homeసినిమా‘దళారి’ టైటిల్ లోగో విడుదల.

‘దళారి’ టైటిల్ లోగో విడుదల.

Dalari: ఎస్. కె. పిక్చర్స్, ఆకృతి క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న తాజా చిత్రం ‘దళారి’. షకలక శంకర్, రాజీవ్ కనకాల, శ్రీ తేజ్ ప్రధాన పాత్రదారులుగా తెరకెక్కిన ఈ సస్పెన్స్ థ్రిల్లర్ఎ, మోషనల్ యాక్షన్ డ్రామా టాకీ పార్ట్ షూటింగ్ ఇటీవలే పూర్తయింది. తాజాగా ఈ సినిమా టైటిల్ ను అనౌన్స్ చేశారు దర్శక నిర్మాతలు. ఈ వేడుకలో నటులు శ్రీ తేజ్, షకలక శంకర్, దర్శకుడు గోపాల్ రెడ్డి, నిర్మాతలు సురేష్ కొండేటి, ఎడవెల్లి వెంకట్ రెడ్డి పాల్గొన్నారు.

షకలక శంకర్ మాట్లాడుతూ… సురేష్ కొండేటి, వెంకట్ రెడ్డి సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు. దర్శకుడు గోపాల్ రెడ్డి అద్భుతంగా సినిమా తెరకెక్కించారు. నటుడు శ్రీ తేజ్ కూడా ఈ సినిమాలో ఒక అద్భుతమైన క్యారెక్టర్ చేశారు. సీనియర్ నటుడు రాజీవ్ కనకాల సినిమా మొత్తానికి ఒక కీలక పాత్ర పోషించారు. ఇప్పటికే దాదాపు షూటింగ్ పూర్తి కావచ్చింది. పోస్ట్ ప్రొడక్షన్ పూర్తైన త‌ర్వాత‌ ఫస్ట్ కాపీ చూసిన తర్వాత మరోసారి మ‌రిన్ని వివ‌రాలు ప్ర‌క‌టిస్తాం అన్నారు.

నిర్మాత సురేష్ కొండేటి మాట్లాడుతూ ‘శంభో శంకర’ బ్లాక్ బస్టర్ విజయం తర్వాత మరోసారి షకలక శంకర్ తో కలిసి ఈ సినిమా చేస్తున్నాను. ఇప్పటి వరకు రాని పాయింట్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. రాజీవ్ కనకాల, శ్రీ తేజ్ పాత్రలు కూడా ఈ సినిమాలో కీలకంగా ఉంటాయి. ఈ సినిమా మాస్ ఎలిమెంట్స్ సస్పెన్స్ యాక్షన్ అన్ని కలగలిపిన సినిమా. అంద‌రికీ క‌నెక్ట్ అవుతుంది అని అన్నారు.

Also Read : అందమైన విలనిజానికి ఆమె కేరాఫ్ అడ్రెస్!

RELATED ARTICLES

Most Popular

న్యూస్