Friday, March 20, 2026
HomeTrending Newsదళిత జర్నలిస్టులకు దళిత బంధు - మంత్రి హరీష్

దళిత జర్నలిస్టులకు దళిత బంధు – మంత్రి హరీష్

సిద్దిపేట జిల్లాలో అక్రిడేషన్ కలిగి ఉన్న ప్రతి దళిత జర్నలిస్టుకు దశల వారీగా దళిత బంధు అందిస్తామని మంత్రి హరీష్ రావు వెల్లడించారు. దళిత్ వర్కింగ్ జర్నలిస్టు వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించిన దళిత్ జర్నలిస్ట్ శిక్షణ తరగతుల ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై శిక్షణ పొందిన జర్నలిస్టులకు మంత్రి హరీష్ రావు సర్టిఫికెట్లు అందజేశారు. కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్టు బుధ పూర్ణిమ ప్రాజెక్ట్ డైరెక్టర్ మల్లెపల్లి లక్ష్మయ్య, సీనియర్ జర్నలిస్టు బుచ్చన్న, స్థానిక జర్నలిస్టులు జంగం రాజలింగం, జనార్దన్, బబ్బూరి రాజు, ఇతర నాయకులు హాజరయ్యారు.

ఈ సందర్భంగా మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ దళిత ప్రజానీకానికి అందుబాటులో ఉన్న సంక్షేమ పథకాలు సబ్సిడీల పై అవగాహన కల్పించి వారికి చైతన్యం కలిగించాలి. వెనుకబడిన వర్గాలను ముందుకు నడిపించే బాధ్యత ప్రతీ జర్నలిస్టులకు ఉందన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ చట్టం తేవడంలో మల్లెపల్లి లక్ష్మయ్య గారి కృషి ఎంతో ఉందని, తెలంగాణలో ఎస్సీ కాంట్రాక్టర్లకు ఇరిగేషన్ ప్రాజెక్టులో రిజర్వేషన్ కల్పించి దేశానికి ఆదర్శంగా నిలిచామన్నారు.

సిద్దిపేట జిల్లాలో అక్రిడేషన్ ఉన్న ప్రతి దళిత జర్నలిస్టుకు దళిత బంధు అందిస్తామని మంత్రి భరోసా ఇచ్చారు. ముఖ్యమంత్రి కేసీఆర్  ధైర్యం వల్లే దళితబంధు సాధ్యమైందన్నారు.  తెలంగాణలో సాధ్యమైన దళిత బంధు దేశంలో ఎందుకు సాధ్యం కాదని వివిధ రాష్ట్రాలలో ప్రజలు ప్రశ్నిస్తున్నారని మంత్రి హరీష్ రావు చెప్పారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular