Sunday, January 19, 2025
HomeTrending Newsదళితుల ఆర్ధికవృద్దికే దళితబంధు

దళితుల ఆర్ధికవృద్దికే దళితబంధు

ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి దళితులను తీసుకపోవడానికే దళిత బంధు పథకం ఉద్దేశ్యం అని మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. దళితుల పేదరికం పోగొట్టేందుకు కెసిఆర్ సంచలనాత్మక నిర్ణయం దళిత బందు పథకమన్నారు. కరీంనగర్ అంబేద్కర్ స్టేడియంలో దళితులకు తెలంగాణ దళిత బంధు ఆస్తుల పంపిణీ కార్యక్రమంలో 63 యూనిట్లకు గాను 146 లబ్దిదారులకు దాదాపు 16 కోట్ల విలువ గల JCBలు, JCB&ట్రాక్టర్లు, ఆర్వెస్టర్లు, DCM వ్యాన్ లు, మంత్రులు గంగుల కమలాకర్, మంత్రి కొప్పుల ఈశ్వర్ లు రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్ తో కలిసి ఈ రోజు అందచేశారు.

దళితుల సంక్షేమానికి కేసీఆర్ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం ఉత్సాహంగా, నిబద్దతతో పనిచేస్తుందని దీనికి చక్కని ఉదాహరణ దళిత బంధు పథకం అని, నిన్నటి వరకు ఒకరి దగ్గర డ్రైవర్ గా పని చేసిన దళితుడు నేడు అదే వాహనానికి ఓనర్ గా మారడం దళిత బంధు గొప్పతనమని మంత్రి కొప్పుల కొనియాడారు. మొదటి విడుతలో దళిత బంధు ద్వారా లబ్ది పొందిన దళితుల్లో ఆర్థికంగా అభివృద్ధి చెందుతామన్న నమ్మకం, ధైర్యం కనబడిందన్నారు. దళితులను ఆర్థిక, సమాజిక వివక్ష నుంచి దూరం చేసి వారిని అన్ని రంగాల్లో అభివృద్ధి పథాన నడిపించేందుకు ప్రభుత్వం చిత్త శుద్ధితో పని చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి, జెడ్పీ చైర్ పర్సన్ విజయ గారు జిల్లా కలెక్టర్, గెల్లు శ్రీనివాస్ యాదవ్ గారు మరియు లబ్దిదారులతో పాటు దళిత సంఘాల నేతలు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్