Saturday, January 18, 2025
Homeసినిమా‘మిషన్ 2020’ టీమ్‌కు అభినందనలు తెలిపిన ‘దర్జా’ బృందం

‘మిషన్ 2020’ టీమ్‌కు అభినందనలు తెలిపిన ‘దర్జా’ బృందం

హనీ బన్నీ క్రియేషన్స్ సమర్పణలో మధు మృదు ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై శ్రీ మిత్ర & మై విలేజ్ సమర్పణలో నవీన్ చంద్ర హీరోగా యదార్ధ సంఘటనల ఆధారంగా సమకాలీన జీవిత సమస్యల నేపథ్యంలో తెరకెక్కిన చిత్రం ‘మిషన్ 2020’. గతంలో శ్రీకాంత్ హీరోగా తెరకెక్కిన ‘మెంటల్ పోలీస్’, ‘ఆపరేషన్ 2019’ సినిమాలను తెరకెక్కించిన కరణం బాబ్జి ఈ చిత్రానికి దర్శకుడు. అక్టోబర్ 29 థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం సక్సెస్‌ఫుల్ టాక్‌తో రన్ అవుతోంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సక్సెస్ మీట్‌లో ‘దర్జా’ మూవీ టీమ్ పాల్గొని చిత్రయూనిట్‌కు అభినందనలు తెలిపింది.

ఈ సందర్భంగా ‘దర్జా’ మూవీ ప్రొడ్యూసర్ శివశంకర్ పైడిపాటి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌ రవి పైడిపాటి మాట్లాడుతూ “మిషన్ 2020 చిత్రాన్ని చూశాము. చాలా బాగా నచ్చింది. యూత్ అంతా తప్పని సరిగా చూడాల్సిన చిత్రమిది. మెసేజ్ అనే కాదు అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ ఈ చిత్రంలో ఉన్నాయి. డైరెక్టర్ ఈ చిత్రాన్ని చాలా చక్కగా తెరకెక్కించారు. క్లారిటీగా.. చూస్తున్న ప్రేక్షకులు థ్రిల్ అయ్యేలా మంచి మెసేజ్‌తో చిత్రాన్ని రూపొందించారు. వారికి ముందుగా మా అభినందనలు. అలాగే ఇలాంటి స్టోరీ వినగానే మాములుగా అయితే నిర్మాతలు ఆలోచిస్తారు. ఇలాంటి సినిమా తీయవచ్చా? లేదా? అని. కానీ అలాంటిదేమీ పట్టించుకోకుండా ఇంత మంచి చిత్రాన్ని నిర్మించిన నిర్మాతలకు కంగ్రాట్స్. ఇంక సంగీత దర్శకుడు రాప్‌రాక్ షకీల్ ఇచ్చిన ఆర్ఆర్ మాములుగా లేదు. ఆయనే మా ‘దర్జా’ చిత్రానికి కూడా సంగీతం అందిస్తున్నారు. అతనికి స్పెషల్‌గా కంగ్రాచ్యులేషన్స్ తెలియజేస్తున్నాము. ఈ చిత్రాన్ని ప్రేక్షకులందరూ థియేటర్లలో చూడాలి. 8వ తరగతి, ఆ పైన చదువుతున్న పిల్లల తల్లిదండ్రులందరూ తప్పక ఈ చిత్రాన్ని చూడండి. మరొక్కసారి మంచి చిత్రాన్ని ప్రేక్షకులకు అందించిన టీమ్‌కు కంగ్రాట్స్ చెబుతున్నాము” అన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్