Friday, March 20, 2026
Homeసినిమా22న 'దాస్ కా ధమ్కీ' విడుదల

22న ‘దాస్ కా ధమ్కీ’ విడుదల

విశ్వక్ సేన్ తొలి పాన్ ఇండియా చిత్రం ‘దాస్ కా ధమ్కీ‘ విడుదలకు సిద్ధమవుతోంది. ఈ చిత్రం మార్చి 22న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేస్తున్నట్లు మేకర్స్ అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. సినిమాలో విశ్వక్ పాత్రలోని రెండు షేడ్స్‌ని చూపించే అనౌన్స్ మెంట్ పోస్టర్ ఆసక్తికరంగా వుంది. పోస్టర్‌లో క్లాస్‌తో పాటు మాస్ అవతార్‌ లో కనిపించారు విశ్వక్ సేన్. అత్యంత భారీ బడ్జెట్‌తో వున్నత నిర్మాణ విలువలతో రూపొందిన ఈ చిత్రానికి విశ్వక్ కథానాయకుడు, దర్శకుడు మాత్రమే కాదు నిర్మాత కూడా విశేషం. ఈ చిత్రంలో విశ్వక్ సేన్ జోడిగా నివేదా పేతురాజ్ నటించింది.

మేకర్స్ ఇప్పటి వరకు విడుదల చేసిన మూడు పాటలు చార్ట్ బస్టర్స్ అయ్యాయి. లియోన్ జేమ్స్ సంగీతం అందించగా, రామ్ మిరియాల మావా బ్రో పాటను స్పెషల్ గా కంపోజ్ చేశారు. థియేట్రిక‌ల్ ట్రైల‌ర్ కూడా సినిమా పై అంచ‌నాలు పెంచింది. వన్మయే క్రియేషన్స్ , విశ్వక్ సేన్ సినిమాస్ బ్యానర్ల పై కరాటే రాజు నిర్మిస్తున్న ఈ చిత్రానికి ప్రసన్న కుమార్ బెజవాడ డైలాగ్స్ రాశారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీని దినేష్ కె బాబు నిర్వహిస్తుండగా, లియోన్ జేమ్స్ సంగీతం అందిస్తుండగా అన్వర్ అలీ ఎడిటర్. తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో విడుదల కానున్న ఈ సినిమాలో రావు రమేష్, హైపర్ ఆది, రోహిణి, పృథ్వీరాజ్ ఇతర ముఖ్యపాత్రలు పోషించారు.

Also Read : ‘దాస్ కా ధమ్కీ’ నుంచి ఓ డాలర్ పిలగా పాట విడుదల

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular