Friday, March 20, 2026
Homeసినిమా'దసరా' సెకండ్ సాంగ్ రిలీజ్ కి ముహుర్తం ఫిక్స్

‘దసరా’ సెకండ్ సాంగ్ రిలీజ్ కి ముహుర్తం ఫిక్స్

నాని మోస్ట్ ఎవైటెడ్ పాన్ ఇండియా మూవీ ‘దసరా’ మాస్-ఆపీలింగ్ ప్రమోషనల్ మెటీరియల్ తో భారీ అంచనాలని నెలకొల్పింది. నాని మాసియస్ట్ ఫస్ట్‌ లుక్‌ తో పాటు ఫస్ట్‌ సాంగ్‌ ధూమ్‌ధామ్‌ కు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. ఇటివలే విడుదలైన దసరా టీజర్ నేషనల్ సెన్సేషన్ గా నిలిచింది. అన్ని వర్గాల ప్రేక్షకులని అలరించి అన్ని భాషల్లో టాప్ ట్రెండింగ్ లో కొనసాగుతుంది. తాజాగా మేకర్స్ దసరా సెకండ్ సింగిల్ అప్ డేట్ ఇచ్చారు. వాలెంటైన్స్ డేకి ఒక రోజు ముందు ఫిబ్రవరి 13 ‘ఓరి వారి’ అనే హార్ట్‌బ్రేక్ సాంగ్ ని విడుదల చేయనున్నారు.

శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్‌ పై సుధాకర్ చెరుకూరి భారీ ఎత్తున నిర్మిస్తున్న ఈ సినిమాతో శ్రీకాంత్ ఓదెల దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. కీర్తి సురేష్ ఈ సినిమాలో నానికి జోడిగా కనిపించనుంది. ధీక్షిత్ శెట్టి, సముద్రఖని, సాయి కుమార్, జరీనా వహాబ్ కీలక పాత్రలలో కనిపించనున్న ఈ చిత్రానికి సత్యన్ సూర్యన్ సినిమాటోగ్రఫర్ గా పని చేస్తున్నారు. సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రానికి ఎడిటర్‌గా నవీన్‌ నూలి, ప్రొడక్షన్‌ డిజైనర్‌గా అవినాష్‌ కొల్లా, ఎగ్జిక్యూటివ్‌ నిర్మాతగా విజయ్‌ చాగంటి వ్యవహరిస్తున్నారు. దసరా చిత్రాన్ని మార్చి 30న తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఏకకాలంలో విడుదల చేయనున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular