Sunday, February 23, 2025
Homeసినిమామే4na దాసరి నేషనల్ ఫిల్మ్ అండ్ టీవీ నేషనల్ అవార్డ్స్

మే4na దాసరి నేషనల్ ఫిల్మ్ అండ్ టీవీ నేషనల్ అవార్డ్స్

Dasari Awards:  దర్శక దిగ్గజం దివంగత దాసరి నారాయణరావు జయంతిని పురస్కరించుకుని దాసరి కల్చరల్ ట్రస్ట్ , ఇమేజ్ ఫిలింస్ సంయుక్తంగా దాసరి పేరిట అవార్డ్స్ ను ప్రధానం చేయనున్నారు. ఈ సంద‌ర్భంగా నిర్మాత తాడివాక రమేష్ నాయుడు మాట్లాడుతూ.. ‌నా గురువు, దైవం అయిన దాసరి పేరిట ప్రతి ఏటా ఫిల్మ్ అండ్ టివి నేషనల్ అవార్డ్స్ ఇవ్వాలని సంకల్పించాం. పాన్ ఇండియా లెవెల్ లో అన్నీ భాషా చిత్రాల టెక్నిషియన్స్ కు దాసరి నేషనల్  అవార్డ్ లను ప్రధానం చేయబోతున్నాం.
ఇందుకోసం ఇప్పటికే “దాసరి నారాయణరావు మెమోరియర్ కల్చరల్ ట్రస్ట్” ఏర్పాటు చేశారు. వివిధ భాషలకు చెందిన కళాకారులు – సాంకేతిక నిపుణులకు జీవన సాఫల్య పురస్కారాలు (లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్స్) ఇవ్వనున్నాం. భారీ స్దాయిలో హైదరాబాదులోనే జరగనున్న ఈ కార్యక్రమానికి ఇరు తెలుగు రాష్ట్రాల సిఎంలను ముఖ్య అతిథులుగా ఆహ్వానించనున్నాం. వేదిక మరియు అవార్డు కమిటీ కి సంబంధించిన వివరాలను త్వరలోనే తెలియచేస్తాం” అన్నారు.
RELATED ARTICLES

Most Popular

న్యూస్