Sunday, January 19, 2025
Homeసినిమాఉస్తాద్ సీక్రెట్ లీక్ చేసిన దశరథ్

ఉస్తాద్ సీక్రెట్ లీక్ చేసిన దశరథ్

పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ కాంబినేషన్లో మూవీ ఎప్పుడెప్పుడు వస్తుందా అని అభిమానులు ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నారు. కారణం ఏంటంటే.. గబ్బర్ సింగ్ మూవీలో పవన్ ను అభిమానులు ఎలా చూడాలి అనుకుంటున్నారో అలా చూపించారు. అంతే గబ్బర్ సింగ్ మూవీ విపరీతంగా నచ్చేసింది. అప్పటి నుంచి గబ్బర్ సింగ్ కాంబోలో మరో మూవీ వస్తే బాగుంటుందని ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు అభిమానులు కోరుకుంటున్న కాంబోలో ‘ఉస్తాద్ భగత్ సింగ్’ మూవీ రూపొందుతుంది.

అయితే.. ఈ చిత్రం తెరికి రీమేక్ అని ప్రచారం జరిగింది. ఆతర్వాత ఇదేదో గ్యాసిప్ అనుకున్నారు. డైరెక్టర్ హరీష్ శంకర్ ఇది రీమేక్ కాదు.. ఓరిజినల్ కథతోనే సినిమా చేస్తాను అని స్టేట్ మెంట్ ఇచ్చారు. ఇటీవల విడుదల చేసిన ఉస్తాద్ భగత్ సింగ్ టీజర్ కూడా కాస్త కొత్తగా వుండటంతో ఈ సినిమా ఓరిజినల్ స్టోరీతోనే తీస్తున్నారు అనుకున్నారు. అయితే.. ఈ చిత్రానికి స్ర్కీన్ ప్లే ను డైరెక్టర్ దశరథ్ అందించారు. ఈమధ్య ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్ వ్యూలో దశరథ్ అసలు విషయం బయటపెట్టారు.

ఇంతకీ ఏం చెప్పారంటే… ఉస్తాద్ భగత్ సింగ్ 90 శాతం స్ట్రయిట్ గా ఉంటుదని చెప్పుకొచ్చారు. హరీష్ శంకర్ తెరకెక్కించిన గబ్బర్ సింగ్, గద్దల కొండ గణేష్‌ రీమేక్స్ కూడా యధావిధిగా వుండవు. తన స్టయిల్ లోకి పూర్తిగా మార్చేసి ప్రజెంట్ చేశాడు. ఉస్తాద్ భగత్ సింగ్ లో కూడా ఆ ఒరిజినాలిటీ చూస్తారని చెప్పారు. దశరధ్ ఇచ్చిన 90 శాతం స్ట్రయిట్ అనే స్టేట్ మెంట్ తో ఉస్తాద్ భగత్ సింగ్ రీమేక్ అనే విషయం బయటపడింది. అయితే.. 90 శాతం స్ట్రైయిట్ గా ఉంటుందని చెప్పడంతో గబ్బర్ సింగ్ వలే ఈ సినిమా కూడా ప్రెష్ గా ఉండి బ్లాక్ బస్టర్ సాధిస్తుందని టాక్ వినిపిస్తుంది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్