Sunday, January 19, 2025
Homeసినిమాసందడిగా సాగిన ''డియర్ మేఘ'' టీజర్ రిలీజ్

సందడిగా సాగిన ”డియర్ మేఘ” టీజర్ రిలీజ్

ఎన్నో ప్రేమ కథలు తెర పైకి వస్తుంటాయి. కానీ కొన్నే మనసును తాకి ఎప్పటికీ గుర్తుండిపోతాయి. అలాంటి ప్రేమ కథ ”డియర్ మేఘ” అంటున్నారు చిత్ర దర్శకుడు సుశాంత్ రెడ్డి. మేఘా ఆకాష్, అరుణ్ ఆదిత్, అర్జున్ సోమయాజులు హీరో హీరోయిన్స్ గా వేదాన్ష్ క్రియేటివ్ వర్క్స్’ సంస్థ ఈ సినిమాను నిర్మించింది. అర్జున్ దాస్యన్ నిర్మాత. టీజర్ విడుదల కార్యక్రమం హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్ లో జరిగింది. ఈ కార్యక్రమంలో చిత్ర బృందం పాల్గొని సందడి చేశారు. మేఘా ఆకాష్ టీజర్ ను రిలీజ్ చేశారు.

అర్జున్ దాస్యన్ మాట్లాడుతూ… “మా చిత్రాన్ని త్వరలో థియేటర్లలో విడుదల చేసేందుకు సిద్ధమవుతున్నాం. తొందర్లనే రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తాం. థియేటర్ లు తెరిచేందుకు అనుమతి ఇచ్చి సినిమా ఇండస్ట్రీని ఎంకరేజ్ చేస్తున్న రెండు తెలుగు రాష్ట్రాల సీఎం లకు కృతజ్ఞతలు చెబుతున్నా” అన్నారు.

దర్శకుడు సుశాంత్ రెడ్డి మాట్లాడుతూ…. “కొన్ని ప్రేమ కథల్ని మనం థియేటర్లో చూసి బయటకు రాగానే మర్చిపోతాం. మరికొన్ని లవ్ స్టోరిలు మాత్రం మన మనసులో నాటుకుపోతాయి. హృదయంలో అలాగే నిలిచి ఉంటాయి. అలాంటి సినిమానే ‘డియర్ మేఘ’ సినిమా” అన్నారు.

హీరోయిన్ మేఘా ఆకాష్ మాట్లాడుతూ..”డియర్ మేఘ” సినిమా నాకు ఎంతో స్పెషల్. ఎందుకంటే నా పేరుతో వస్తున్న సినిమా కాబట్టి. కొంత గ్యాప్ తర్వాత నేను ఈ సినిమాతోనే తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాను. డైరెక్టర్ సుశాంత్, హీరో అరుణ్ నాపై నమ్మకం ఉంచి, నేను ఈ క్యారెక్టర్ చేయగలను అని ఆఫర్ చేశారు. వాళ్లకు థాంక్స్. నాకు తెలుగు సినిమాలు చేయడం ఇష్టం కానీ చాలా కారణాలతో ఇక్కడ ఎక్కువగా చిత్రాలు చేయలేకపోతున్నా” అన్నారు.

హీరో అరుణ్ ఆదిత్ మాట్లాడుతూ… వెబ్ సిరీస్ లు వచ్చాక బోల్డ్ కంటెంట్ చూపిస్తున్నారు, బ్యాడ్ వర్డ్స్ డైలాగ్స్ చెబుతున్నారు. ఇవన్నీ ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తున్నారు. అయితే ఇలాంటి టైమ్ లో ఓ బ్యూటిఫుల్ లవ్ స్టోరిని ”డియర్ మేఘ” తో చూపించే ప్రయత్నం చేస్తున్నాం. ఈ సినిమా మిమ్మల్ని ఆకట్టుకునే ప్రేమ కథ అవుతుంది” అన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్