Saturday, January 18, 2025
Homeసినిమాఎన్టీఆర్ సరసన దీపికా?

ఎన్టీఆర్ సరసన దీపికా?

NTR-Deepika: యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ న‌టించిన‌ ఆర్ఆర్ఆర్ చిత్రం 1000 కోట్లు క‌లెక్ట్ చేసి సంచ‌ల‌న విజ‌యం సాధించ‌డం తెలిసిందే. దీంతో ఎన్టీఆర్ న‌టించే నెక్ట్స్ మూవీస్ పై అటు అభిమానుల్లోనూ ఇటు ఇండ‌స్ట్రీలోనూ భారీ అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి. త‌దుప‌రి చిత్రాన్ని బ్లాక్ బ‌స్ట‌ర్ డైరెక్ట‌ర్ కొర‌టాల శివ‌తో చేస్తున్న విష‌యం తెలిసిందే. ఈ భారీ చిత్రాన్ని త్వ‌ర‌లో సెట్స్ పైకి తీసుకొచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు.

ఇదిలా ఉంటే… కొర‌టాల శివ‌తో సినిమా త‌ర్వాత పాన్ ఇండియా డైరెక్ట‌ర్ ప్ర‌శాంత్ నీల్ తో ఓ భారీ చిత్రం చేయ‌నున్నారు. ఎన్టీఆర్ 31వ సినిమాగా రానున్న ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ దీపికా పడుకునే న‌టించ‌నుంద‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. ఇదే క‌నుక‌ నిజమైతే… ఈ భారీ చిత్రం పై క్రేజ్ రావ‌డం ఖాయం. ప్రస్తుతానికి అయితే.. హిందీ సోషల్ మీడియాలో ఈ ఊహాగానాలు బాగా వినిపిస్తున్నాయి.  ఇక ఈ చిత్రం రెగ్యులర్ షూట్ ను ప్రశాంత్ నీల్ అక్టోబర్ సెకండ్ వీక్ నుంచి ప్లాన్ చేస్తున్నార‌ని తెలిసింది. ప్ర‌శాంత్ నీల్ ఎన్టీఆర్ అభిమాని.. దీంతో ఎన్టీఆర్ ను ఓ రేంజ్ లో చూపిస్తాడ‌ని.. ఈ సినిమా సంచ‌ల‌నం సృష్టించ‌డం ఖాయ‌మ‌ని నంద‌మూరి అభిమానులు గ‌ట్టి న‌మ్మ‌కంగా ఉన్నారు.

Also Read : ఎన్టీఆర్ గురించి ప్ర‌శాంత్ నీల్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

RELATED ARTICLES

Most Popular

న్యూస్