అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా కొహెడ మార్కెట్ ఉండాలన్నది ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచన అని 140 కోట్ల జనాభా ఉన్న మన దేశంలో పండ్ల రైతులకు ప్రోత్సాహం అవసరమని వ్యవసాయ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. మారుతున్న జీవనశైలి నేపథ్యంలో పండ్ల ప్రాధాన్యం పెరిగింది .. ప్రజలు ఎక్కువగా పండ్లను వినియోగిస్తున్నారని తెలిపారు. కోహెడ మార్కెట్ నిర్మాణం నేపథ్యంలో ఢిల్లీ ఆజాద్ పూర్ మండీని ఈ రోజు సందర్శించిన వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి. మంత్రికి ఆజాద్ పూర్ మండి చైర్మన్ అదిల్ ఖాన్ స్వాగతం పలికారు. వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్ రావు, ఉద్యానశాఖ డైరెక్టర్ వెంకట్రామ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
మారుతున్న కాలానికి అనుగుణంగా ఆహారపు అలవాట్లు మారాయి, భవిష్యత్ లో మరింత మారతాయని మంత్రి వెల్లడించారు. దేశంలో అతి పెద్ద ఢిల్లీ ఆజాద్ పూర్ మండీ సందర్శన .. ఏడాదికి రూ.100 కోట్ల ఆదాయం .. 1975 లో 90 ఎకరాలలో నిర్మాణం చేశారని, తెలంగాణ గిడ్డంగుల సంస్థ ఆధ్వర్యంలో కోహెడలో కోల్డ్ స్టోరేజ్ ఏర్పాటు జరుగుతుందని, ఆజాద్ పూర్ మండిలో పండ్లు, కూరగాయలు, పసుపు మార్కెటింగ్ విధానం పరిశీలించామని, రైతులు, ట్రేడర్లు, అధికారులతో సమావేశం .. మార్కెట్ నిర్వహణపై మంత్రి చర్చ జరిపారు.