పార్టీ ఆవిర్భావం అనంతరం.. రెండో రోజు కూడా, ఢిల్లీ లో బి ఆర్ ఎస్ అధినేత సీఎం కేసిఆర్ కు శుభాకాంక్షల వెల్లువ కొనసాగింది. సందర్శకులు ప్రజా ప్రతినిధులతో గురువారం రోజంతా సీఎం బిజీ బిజీ గా గడిపారు. బి ఆర్ ఎస్ జాతీయ కార్యాలయ ప్రారంభం కోసం తెలంగాణ నుంచి వేలాది గా తరలివచ్చిన పార్టీ నేతలు కార్యకర్తలతో పాటు, ఉత్తరాది నుంచి వచ్చిన వందలాది రైతు సంఘాల నేతలు ప్రముఖులతో సీఎం కేసిఆర్ అధికారిక నివాసం తుగ్లక్ రోడ్ పరిసర ప్రాంతాలు జన సందోహంతో కిక్కిరిసి పోయాయి. ముఖ్యమంత్రి చంద్ర శేఖర్ రావుని ఢిల్లీ లోని సీఎం అధికారిక నివాసంలో కలిసిన ఏ.ఐ.ఎం.ఐ.ఎం అధ్యక్షుడు, లోక్ సభ సభ్యుడు అసదుద్దీన్ ఓవైసీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా తన కుమార్తె వివాహానికి రావాల్సిందిగా ఆహ్వాన పత్రిక అందించారు.
తనను కలిసి శుభాకాంక్షలు తెలపడానికి వచ్చిన ప్రతి అభిమాని, కార్యకర్త ను పేరు పేరునా పలకరించి వారితో కలిసి సీఎం కేసిఆర్ ఫోటో దిగారు. టి ఆర్ ఎస్ పార్టీ బి అర్ ఎస్ గా జాతీయ పార్టీ గా అవతరించిన చారిత్రక నేపథ్యంలో, తమ అభిమాన నేతను కలిసి శుభాకాంక్షలు తెలిపి ఫోటో దిగి, తమ ఢిల్లీ జ్ఞాపకాలను పదిలంగా దాచుకుని నూతనోత్సాహంతో అభిమానులు తిరుగు ప్రయాణమయ్యారు.
Also Read : బిఆర్ఎస్ కార్యాలయం ప్రారంభం