Saturday, November 23, 2024
HomeTrending NewsDelhi Policy: విద్యా శాఖలో ఢిల్లీ తరహా విధానం

Delhi Policy: విద్యా శాఖలో ఢిల్లీ తరహా విధానం

విద్యార్థులలో సామాజిక-భావోద్వేగ నైపుణ్యాలను పెంపొందించే ప్రత్యేక కార్యక్రమాన్ని ఈ విద్యా సంవత్సరం నుంచి ప్రారంభించనున్నట్లు విద్యా శాఖ మంత్రి పి. సబితా ఇంద్రారెడ్డి వెల్లడించారు. సోమవారం విద్యా శాఖ పని తీరును సమీక్షించారు. ఢిల్లీ తరహా విధానాన్ని ఇక్కడ అమలు చేయబోతున్నామని మంత్రి పేర్కొన్నారు. విద్యార్థుల విశ్వాసం, మానసిక, భావోద్వేగ శ్రేయస్సు, సామాజిక నైపుణ్యాలు దెబ్బతినకుండా వారిలో మనోస్తైర్యం కల్పించనున్నట్లు మంత్రి తెలిపారు. ఈ విద్యా సంవత్సరంలో జిల్లాకు ఒక పాఠశాల చొప్పున 6,7 వ తరగతి విద్యార్థులను ఎంపిక చేసి ఈ కార్యక్రమాన్ని అమలు చేయనున్నట్లు మంత్రి తెలిపారు. విద్యార్థుల్లో ప్రతికూల పరిస్థితులను, ఇబ్బందులను తొలగించి భవిష్యత్ పట్ల ఆశావాద దృక్పథాన్ని పెంపొందించేందుకు ఈ కార్యక్రమం ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.

ఇందుకోసం ఎంపిక చేసిన పాఠశాలల్లో ఇద్దరేసి ఉపాధ్యాయులకు ప్రత్యేక శిక్షణ అందించనున్నట్లు మంత్రి తెలిపారు. విద్యార్థి దశలోనే వ్యాపార ఆవిష్కరణలు ప్రోత్సహించాలని ప్రభుత్వం నిర్ణయించిందని మంత్రి వెల్లడించారు. మొదటి దశలో 8 జిల్లాలోని 24 మోడల్ స్కూళ్లను ఎంపిక చేసి అందులో ఇంటర్ మొదటి సంవత్సరం చదివే 2500 మంది విద్యార్థులను వ్యాపార ఆవిష్కరణల పట్ల ప్రోత్సహించనున్నట్లు మంత్రి తెలిపారు. ఇందులో మెరుగైన 1500 ఆవిష్కరణలను ప్రోత్సహించి. ఒక్కో ఆవిష్కరణ కు రెండు వేల రూపాయలను అందజేసి ప్రభుత్వం సహకరిస్తుందని పేర్కొన్నారు.వీరితో ప్రత్యేక ఎగ్జిబిషన్ లు ఏర్పాటు చేసి, వీరిని భవిష్యత్ లో ఉత్తమ ఔత్సాహిక పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం అన్ని రకాలుగా ప్రోత్సహిస్తుందని అన్నారు. ఈ సమావేశంలో విద్యా శాఖ కార్యదర్శి వాకాటి కరుణ, పాఠశాల విద్య సంచాలకులు శ్రీ దేవసేన తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్