Sunday, January 19, 2025
HomeTrending Newsనెల్లూరుకు మేకపాటి భౌతికకాయం

నెల్లూరుకు మేకపాటి భౌతికకాయం

Mekapati Last Rituals:  దివంగత మంత్రి మేకపాటి రాజమోహన్ రెడ్డి భౌతిక కాయాన్ని నెల్లూరు లోని అయన స్వగృహానికి తరలించారు. నేటి ఉదయం బేగంపేట్ విమానాశ్రయం నుంచి ఆర్మీ హెలికాప్టర్ ద్వారా నెల్లూరు పరేడ్ గ్రౌండ్స్ కు, అక్కడి నుంచి  ప్రత్యేక వాహనంపై రోడ్డు  ద్వారా ఇంటికి తీసుకు వెళ్ళారు. వేలాది మంది  మేకపాటి అభిమానులు, ఆత్మకూరు నియోజకవర్గ ప్రజలు, వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలు గౌతమ్ రెడ్డికి కడసారి నివాళులు అర్పించేందుకు తరలి వస్తున్నారు. రేపు ఉదయం 11 గంటలకు ఉదయగిరిలోని మెరిట్స్ కళాశాల గ్రౌండ్స్ లో అయన  పూర్తి ప్రభుత్వ అధికార లాంచనాలతో అంత్యక్రియలు జరగనున్నాయి. దానికి సంబంధించిన ఏర్పాట్లు అధికారులు చేస్తున్నారు.

రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తోపాటు పలువురు మంత్రులు ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు పార్టీ నేతలు రేపటి అంత్యక్రియలకు హాజరు కానున్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్