Saturday, March 14, 2026
Homeసినిమాడిసెంబర్ 31న సోని అగర్వాల్‌ ‘డిటెక్టివ్‌ సత్యభామ’

డిసెంబర్ 31న సోని అగర్వాల్‌ ‘డిటెక్టివ్‌ సత్యభామ’

Satyabhama coming:
సిన్మా ఎంటర్టైన్మెంట్‌ పతాకంపై శ్రీశైలం పోలెమోని నిర్మాతగా నవనీత్‌ చారి దర్శకత్వంలో సోనీ అగర్వాల్‌ నటిస్తున్న సస్పెన్స్ థ్రిల్లర్ ‘డిటెక్టివ్‌ సత్యభామ’. ఈ చిత్రం ఈ నెల డిసెంబర్ 31న థియేటర్లలో విడుదలవుతుంది. ఈ సంద‌ర్భంగా సోనీ అగర్వాల్ మాట్లాడుతూ… “7జి బృందావన్‌ కాలనీ’ చిత్రం తర్వాత నాకు అంతగా గొప్పగా పేరు తెచ్చిన సినిమాలు లేవు కానీ.. సెకండ్ ఇన్నింగ్స్ లో అంత క్రేజ్ తెచ్చే మూవీ ఈ  ‘డిటెక్టివ్‌ సత్యభామ’ అవుతుంది  ఎందుకంటే మూవీ పోస్థ ప్రొడక్షన్ అంతా ముంబైలో పూర్తి చేసి ఫస్ట్ కాపీ నాకు ముంబయిలో చూపించారు. నాకు చాలా బాగా నచ్చింది. ఈ నెల 28 నుండి హైదరాబాద్ లో ఉండి చిత్ర యూనిట్ తో ప్రమోషన్స్ లో పాల్గొంటా”నని చెప్పారు.

నిర్మాత శ్రీశైలం మాట్లాడుతూ “ఈ చిత్రాన్ని అన్నివర్గాల ప్రేక్షకులకు నచ్చే విధంగా అన్ని హంగులతో తీర్చిదిద్దాం. డిసెంబర్ 31న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్స్ లో రిలీజ్ చేస్తున్నాం” అన్నారు.

దర్శకుడు నవనీత్‌ చారి మాట్లాడుతూ  “డిటెక్టివ్‌ సత్యభామ చిత్రాన్ని సస్పెన్స్ థ్రిల్లర్ జోనర్లో తెరకెక్కించాను. ఇందులో నాలుగు పాటలు కథలో భాగంగా యాక్షన్స్ సీన్స్ కూడా ఉంటాయి. ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయమౌతున్నాను. అంద‌రికీ ఈ చిత్రం న‌చ్చుతుంది” అన్నారు.

Also Read : సోని అగర్వాల్‌ ‘డిటెక్టివ్‌ సత్యభామ’ ట్రైలర్‌ విడుదల

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular