Sunday, September 8, 2024
Homeసినిమాక్లైమాక్స్ దిశగా కదులుతున్న 'దేవర' 

క్లైమాక్స్ దిశగా కదులుతున్న ‘దేవర’ 

ఎన్టీఆర్ – కొరటాల కాంబినేషన్లో ‘దేవర’ సినిమా రూపొందుతోంది. కొసరాజు హరికృష్ణ – నందమూరి కల్యాణ్ రామ్ నిర్మిస్తున్న ఈ సినిమా, చకచకా షూటింగు జరుపుకుంటోంది. సముద్రం నేపథ్యంలో ఈ కథ నడుస్తుంది. ఎన్టీఆర్ ఫస్టు లుక్ పోస్టర్ దగ్గర నుంచి అందరిలో ఈ సినిమా పట్ల ఆసక్తి పెరుగుతూ వెళుతోంది. భారీ యాక్షన్ సీన్స్ ఈ సినిమాలో ఉన్నాయనే ఒక విషయం అందరికీ స్పష్టంగా అర్థమైపోయింది. అలాంటి ఈ సినిమా, చిత్రీకరణ పరంగా చివరిదశకు చేరుకుందని తెలుస్తోంది.

ఈ సినిమాకి సంబంధించిన క్లైమాక్స్ దృశ్యాలను చిత్రీకరించడానికి టీమ్ రెడీ అవుతోంది. వచ్చేనెల మొదటి వారం నుంచి అందుకు సంబంధించిన సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. ఎన్టీఆర్ – సైఫ్ అలీఖాన్ పై క్లైమాక్స్ ఉంటుంది. ఇద్దరివీ బలమైన పాత్రలు కావడం వలన, ఆ స్థాయికి తగినట్టుగానే క్లైమాక్స్ ఉండనుందని అంటున్నారు. ఎన్టీఆర్ అభిమానుల అంచనాలకి తగినట్టుగా క్లైమాక్స్ ఉంటుందని చెబుతున్నారు. వాళ్లంతా ఈ క్లైమాక్స్ గురించి చాలాకాలం పాటు మాట్లాడుకుంటారనే ఒక టాక్ బయటికి వచ్చింది.

‘దేవర’కి సంబంధించిన ఫస్టు పార్టు మాత్రమే ఇది. అందువలన ఈ క్లైమాక్స్ అసంతృప్తిగా అనిపించ కూడదు .. అదే సమయంలో సెకండ్ పార్టుపై అంచనాలు పెంచేదిగా ఉండాలి. ఆ విషయంపై గట్టిగానే కసరత్తు చేసి, రంగంలోకి దిగినట్టుగా చెబుతున్నారు. ఇతర ప్రధానమైన .. కీలకమైన పాత్రలన్నీ కూడా ఈ క్లైమాక్స్ తో ముడిపడి ఉన్నాయి. అందువలన భారీస్థాయిలో ఈ సన్నివేశాలను డిజైన్ చేసినట్టుగా చెబుతున్నారు. జాన్వీ కపూర్ కథానాయికగా కనిపించనున్న ఈ సినిమాకి, అనిరుధ్ సంగీతాన్ని అందించాడు. అక్టోబర్ 10వ తేదీన ఈ సినిమా థియేటర్లకు రానుంది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్