Sunday, January 19, 2025
HomeTrending Newsకెసిఆర్ నాయకత్వంలోనే తెలంగాణ అభివృద్ధి

కెసిఆర్ నాయకత్వంలోనే తెలంగాణ అభివృద్ధి

Development Of Telangana With Kcr  :

ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు ఎంతో సంతోషంగా ఉన్నారని రాష్ట్ర మున్సిపల్, పరిశ్రమల శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు అన్నారు. సనత్ నగర్ నియోజకవర్గ పరిధిలోని బేగంపేట డివిజన్ లో 61 కోట్ల రూపాయల విలువైన పలు అభివృద్ధి పనులను పశుసంవర్ధక, మత్స్య, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తో కలిసి శనివారం ప్రారంభించారు. ముందుగా SP రోడ్ లో ప్యాట్నీ నాలా పై 10 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టనున్న వంతెన నిర్మాణ పనులను ప్రారంభించారు. అనంతరం పాటిగడ్డ లో 6 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించనున్న మల్టి ఫర్పస్ ఫంక్షన్ హాల్ నిర్మాణ పనులను,SNDP కార్యక్రమంలో భాగంగా 45 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టనున్న బేగంపేట నాలా అభివృద్ధి పనులను అల్లంతోట బావి, బ్రాహ్మణ వాడి లలో ప్రారంభించారు.

పాటిగడ్డ లో స్థానిక ప్రజలను ఉద్దేశించి మంత్రి KTR మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారం లో, ప్రభుత్వ పథకాల అమలులో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అందరికంటే ముందుంటారని ప్రశంసించారు. ప్రభుత్వం ఏ కార్యక్రమం చేపట్టినా అది ముందుగా సనత్ నగర్ నియోజకవర్గంలోనే అమలవుతుందని, ఇది శ్రీనివాస్ యాదవ్ కు నియోజకవర్గ అభివృద్ధిపై ఉన్న పట్టుదలకు నిదర్శనంగా పేర్కొన్నారు. నిరుపేదలు శుభకార్యాల నిర్వహణ కోసం లక్షలాది రూపాయలు ఖర్చు చేయాల్సి వస్తుందని అన్నారు. వారి ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని పాటిగడ్డ ప్రాంతంలో ఉన్న పేద, మధ్య తరగతి ప్రజల కోసం R&B శాఖ కు చెందిన 1200 గజాల స్థలాన్ని GHMC కి బదలాయించి 6 కోట్ల రూపాయల వ్యయంతో నూతనంగా మల్టి ఫర్పస్ ఫంక్షన్ హాల్ ను నిర్మిస్తున్నట్లు వివరించారు. నామమాత్రపు ధరపై ఈ ఫంక్షన్ హాల్ ను అద్దెకు ఇవ్వబడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో MLC సురభి వాణిదేవి, మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత, కార్పొరేటర్ మహేశ్వరి, కొలన్ లక్ష్మీ, కుర్మ హేమలత, మాజీ కార్పొరేటర్ లు ఉప్పల తరుణి అత్తిలి అరుణ గౌడ్, నామన శేషుకుమారి ఆకుల రూప, పలువురు అధికారులుపాల్గొన్నారు.

Also Read : హెచ్​ఎండిఏకు దిశా నిర్దేశం

RELATED ARTICLES

Most Popular

న్యూస్