Thursday, March 19, 2026
Homeసినిమా'డెవిల్' కథ ఇదే .. సీక్వెల్ ఉంటుందన్న హీరో!

‘డెవిల్’ కథ ఇదే .. సీక్వెల్ ఉంటుందన్న హీరో!

అది 1945 .. ఆంగ్లేయులకు సుభాశ్ చంద్రబోస్ కంటిపై కునుకు లేకుండా చేస్తున్న కాలం. అతనిని పట్టుకోవడానికి అదే పనిగా ప్రయత్నాలు చేస్తున్న కాలం. ఆ సమయంలో సుభాశ్ చంద్రబోస్ కదలికలు బయటపడకుండా ఆయన అనుచరులు ఒక రక్షణ కవచంగా ఏర్పడ్డారు. దాంతో నేతాజీ ఎక్కడ ఉన్నాడో .. ఎప్పుడు ఎక్కడికి వెళుతున్నాడో తెలుసుకోవడం ఆంగ్లేయులకు కష్టమైపోయింది. అలాంటి పరిస్థితుల్లో ఆయనకి కుడిభుజంగా ఉన్న ‘త్రివర్ణ’ను పట్టుకోవాలని బ్రిటిష్ అధికారులు భావిస్తారు. ఈ కల్పిత పాత్రను ప్రధానంగా చేసుకుని నడిచిన పాత్రనే ‘డెవిల్’.

కల్యాణ్ రామ్ హీరోగా అభిషేక్ నామా రూపొందించిన ఈ సినిమా నిన్ననే థియేటర్లకు వచ్చింది. మద్రాస్ ప్రెసిడెన్సీ .. దానిని ఆనుకుని ఉన్న గ్రామాల నేపథ్యంలో ఈ కథ నడుస్తుంది. నేతాజీని బంధించడానికి కొంతమంది స్వార్థపరులను బ్రిటిష్ ప్రభుత్వం ఉపయోగించుకోవడం .. నేతాజీ అనుచరులను శిక్షించడం ప్రధానమైన కథగా నడుస్తుంది. బలమైన ఈ కథను అంతే బలంగా తయారు చేసుకుని రంగంలోకి దిగినట్టు, సినిమా చూస్తుండగానే మనకి అర్థమైపోతుంది. నిర్మాణ విలువల విషయంలో రాజీ పడకపోవడం కనిపిస్తుంది.

కథలోని ప్రధానమైన పాత్రల మధ్య నడిచే వ్యూహాలు .. ప్రతి వ్యూహాలు ఆడియన్స్ ను  థ్రిల్ చేస్తాయి. ఈ కంటెంట్ పట్ల చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నట్టుగా కల్యాణ్ రామ్ చెప్పాడు. ఇప్పుడు ఈ సినిమాకి వస్తున్న రెస్పాన్స్ పట్ల కూడా ఆయన చాలా హ్యాపీగా ఉన్నట్టుగా చెబుతున్నారు. అందుకు తగినట్టుగానే ఈ సినిమాకి సీక్వెల్ ఉంటుందనీ .. 2024- 25 మధ్యలో ‘డెవిల్ 2’ సెట్స్ పైకి వెళుతుందని స్పష్టం చేశాడు. మళ్లీ ఇదే టీమ్ ఈ సినిమాకి పనిచేస్తుందనే అనుకోవచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular