Tuesday, January 21, 2025
Homeసినిమాపవన్ మూవీకి బాలయ్య టైటిల్?

పవన్ మూవీకి బాలయ్య టైటిల్?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ తన మేనల్లుడు సాయిధరమ్ తేజ్ తో కలిసి ఓ భారీ చిత్రం చేస్తున్నారు.  సముద్రఖని దర్శకత్వంలో వస్తున్న ఈ  మూవీని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తోంది. తమిళ్ లో విజయం సాధించిన వినోదయ సీతం చిత్రానికి రీమేక్ ఇది. ఈ మూవీ ఎప్పటి నుంచో వార్తల్లో ఉంది. తాజాగా సెట్స్ పైకి వచ్చింది. ఇందులో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ దేవుడు పాత్ర పోషిస్తుండడం విశేషం. ఈ మూవీ కోసం 25 రోజులు డేట్స్ ఇచ్చారట పవర్ స్టార్. త్వరగా షూటింగ్ కంప్లీట్ చేసి కుదిరితే సమ్మర్ లో ఈ చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నారట మేకర్స్.

ఈ చిత్రానికి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్  స్క్రీన్ ప్లే – సంభాషణలు అందిస్తుండడం విశేషం.  ఎస్ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నారు. సాయిధరమ్ తేజ్ కి జంటగా కేతిక శర్మ నటిస్తుండగా కీలక పాత్రలో ప్రియా ప్రకాష్‌ వారియర్ ని ఎంచుకున్నారు. ఇక అసలు విషయానికి వస్తే.. ఈ చిత్రానికి బాలయ్య టైటిల్ పెట్టాలనుకుంటున్నారట. బాలయ్య టైటిల్ ఏంటి..? ఈ సినిమాకి పెట్టాలి అనుకోవడం ఏంటి అనుకుంటున్నారా..? బాలకృష్ణ హీరోగా దేవుడు అనే టైటిల్ తో సినిమా చేశారు. విలేజ్ డ్రామాగా రూపొందిన దేవుడు చిత్రం ఆశించిన స్థాయిలో మెప్పించలేదు.

అయితే.. ఇప్పుడు అదే టైటిల్.. దేవుడు.. పెట్టాలనుకుంటున్నారట. ఈ మూవీలో పవర్ స్టార్ దేవుడు క్యారెక్టర్ చేస్తున్నారు కాబట్టి ఈ టైటిలే యాప్ట్ గా ఉంటుందనే  టాక్ వినిపిస్తోంది. కొంత భాగం చిత్రీకరణ అయ్యాక ఫస్ట్ లుక్ రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ మూవీకి ఉన్న క్రేజ్ దృష్ట్యా బడ్జెట్ తో సంబంధం లేకుండా ఈజీగా వంద కోట్ల మార్కుని అందుకునే అంచనాలు బలంగా ఉన్నాయి. మరి.. ప్రచారంలో ఉన్నట్టుగా ఈ చిత్రానికి దేవుడు టైటిల్ ఫిక్స్ చేస్తే.. మరింత క్రేజ్ రావడం ఖాయం.

Also Read : పవన్, తేజ్ మధ్యలో శ్రీలీల? 

RELATED ARTICLES

Most Popular

న్యూస్