Saturday, January 18, 2025
HomeTrending Newsప్రతిరోజూ ఆఫీసుకు రావాల్సిందే: ఐపీఎస్ లకు డిజిపి షాక్

ప్రతిరోజూ ఆఫీసుకు రావాల్సిందే: ఐపీఎస్ లకు డిజిపి షాక్

ప్రస్తుతం వెయిటింగ్ లో ఉన్న ఐపీఎస్ అధికారులకు డిజిపి ద్వారకాతిరుమలరావు షాక్ ఇచ్చారు. వారు ప్రతి రోజు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు డీజీపీ ఆఫీసులోనే ఉండాలని, ఉదయం-సాయంత్రం ఆఫీసులోని వెయిటింగ్ హాల్ లో ఉన్న అటెండెన్స్ రిజిస్టర్ లో సంతకాలు చేయాలని ఆదేశాలు జారీ చేశారు.

గత ప్రభుత్వ హయాంలో కీలకంగా పనిచేసి పలు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐపీఎస్ అధికారుల్లో 16 మందిని వారి విధుల నుంచి తప్పించి డిజిపి ఆఫీసుకు రిపోర్ట్ చేయాలని ఆదేశించింది. ఆ తర్వాత వారికి ఎలాంటి పోస్టింగ్ లూ ఇవ్వలేదు. అయితే ఈ అధికారులు హెడ్ క్వార్టర్స్ లో అందుబాటులో  ఉండడం లేదన్న విషయమై పలు ఫిర్యాదులు డిజిపి అందాయి. దీనిపై స్పందించిన డిజిపి ఈ మేరకు మెమో జారీ చేశారు.

మెమో అందుకున్న వారిలో….

ఐపీఎస్ అధికారులలో డిజిపి ర్యాంక్ అధికారులు….. పీఎస్సార్ ఆంజనేయులు, పివి సునీల్ కుమార్, ఎన్. సంజయ్

ఐజి స్థాయి అధికారులు:  కాంతిరాణా టాటా, జి. పాలరాజు, కొల్లి రఘురామిరెడ్డి

డిఐజి స్థాయి అధికారులు:  ఆర్.ఎన్. అమ్మిరెడ్డి, సిహెచ్. విజయరావు, విశాల్ గున్నీ

ఎస్పీ స్థాయి అధికారులు: కెకెఎన్ అన్బురాజన్,  వై రవిశంకర్ రెడ్డి, వై. రిశాంత్ రెడ్డి, కె. రఘువీరారెడ్డి,  పి. పరమేశ్వర్ రెడ్డి, పి. జాషువా, కృష్ణకాంత్ పటేల్ ఉన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్