Thursday, March 19, 2026
Homeసినిమా"ధమాకా" డిసెంబర్ 23న విడుదల

“ధమాకా” డిసెంబర్ 23న విడుదల

రవితేజ, త్రినాథరావు నక్కిన కాంబినేషన్లో రూపొందుతోన్న ధమాకా. రవితేజ సరసన  శ్రీలీల హీరోయిన్ గా నటిస్తుంది. ఈ చిత్రాన్ని టిజి విశ్వ ప్రసాద్ భారీగా నిర్మిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ & అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ పతాకాల పై రూపొందుతున్న ఈ చిత్రానికి వివేక్ కూచిభొట్ల సహ నిర్మాత. దీపావళి శుభాకాంక్షలు తెలుపుతూ ధమాకా విడుదల తేదిని ప్రకటించారు మేకర్స్. డిసెంబర్ 23న ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లో విడుదల కానుంది.

ఇప్పటికే విడుదలైన ధమాకా పాటలు, టీజర్ సినిమా పై భారీ అంచనాలు పెంచాయి. ఇటివలే విడుదలైన మాస్ క్రాకర్ టీజర్ సినిమా ట్యాగ్ లైన్ కి తగ్గట్టు ‘డబుల్ ఇంపాక్ట్’ క్రియేట్ చేసింది. ప్రసన్న కుమార్ బెజవాడ ఈ చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లే, సంభాషణలు అందించగా, కార్తీక్ ఘట్టమనేని సినిమాటోగ్రఫర్ గా. భీమ్స్ సిసిరోలియో సంగీతం సమకూరుస్తున్నారు. రవితేజ, శ్రీలీల జంటగా నటిస్తున్న ఈ చిత్రానికి కథ, మాటలు: ప్రసన్న కుమార్ బెజవాడ అందించగా, సంగీతం భీమ్స్ సిసిరోలియో అందించారు.

Also Read : ‘ధమాకా’ నుంచి ‘మాస్ రాజా’ లిరికల్ వీడియో రిలీజ్ 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular