Sunday, January 19, 2025
Homeసినిమా'ధమాకా' హిట్ లో ఫస్టు క్రెడిట్ ఆయనదే: రవితేజ

‘ధమాకా’ హిట్ లో ఫస్టు క్రెడిట్ ఆయనదే: రవితేజ

రవితేజ – శ్రీలీల జంటగా ‘ధమాకా‘ సినిమా రూపొందింది. మాస్ కంటెంట్ ఉన్న కథలను తెరకెక్కించడంలో తనకంటూ  ఒక ప్రత్యేకత ఉన్న నక్కిన త్రినాథరావు ఈ సినిమాకి దర్శకత్వం వహించాడు. పీపుల్ మీడియా బ్యానర్ పై నిర్మితమైన ఈ సినిమా ఈ నెల 23వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 6 రోజుల్లోనే 50 కోట్ల మార్కును దాటేసిన ఈ సినిమా,  నిన్న హైదరాబాద్ లో ‘మాస్ మీట్’  అంటూ సక్సెస్ మీట్ ను జరుపుకుంది.

ఈ కార్యక్రమానికి ఈ సినిమా నటీనటులు .. సాంకేతిక నిపుణులతో పాటు, రాఘవేంద్రరావు .. హరీశ్ శంకర్ .. బండ్ల గణేశ్ హాజరయ్యారు. ఈ స్టేజ్ పై రవితేజ మాట్లాడుతూ .. ” ఈ సినిమా హిట్ కావడంలో ప్రధానమైన పాత్రను  భీమ్స్ పోషించాడు. అందువలన ఫస్టు క్రెడిట్ ఆయనకి ఇవ్వడమే కరెక్టు.  ఆ తరువాత నిర్మాతలు .. రైటర్ ప్రసన్నకుమార్ బెజవాడ .. కెమెరామెన్ .. ఎడిటర్లు వస్తారు” అని అన్నాడు. శ్రీలీల డాన్స్ దుమ్ము రేపేసింది .. ఆమె నెంబర్ వన్ పొజిషన్ కి చేరుకోవడం ఖాయం. అభిమానుల సపోర్టు ఎప్పటికీ ఇలానే ఉండాలని కోరుకుంటున్నాను” అని అన్నాడు.

ఇక రాఘవేంద్రరావు మాట్లాడుతూ .. రవితేజ తన చిన్నప్పటి నుంచి ఇలాగే ఉన్నాడంటూ నవ్వులు పూయించారు. ఈ సినిమా పీపుల్ మీడియావారికి కాసుల వర్షం కురిసిపిస్తుందని అన్నారు. హరీశ్ శంకర్ మాట్లాడుతూ .. తను ఈ రోజున ఈ స్థాయిలో ఉండటానికి కారణం రవితేజనే అని చెప్పాడు. సంక్రాంతి వరకూ ఈ సినిమా వసూళ్లు తగ్గవని కుండబద్దలు కొట్టాడు. ఇక బండ్ల గణేశ్ మాట్లాడుతూ .. రవితేజ పనైపోయిందని అనుకున్న ప్రతి ఒక్కరికీ ఎప్పటికప్పుడు హిట్లతోనే ఆయన సమాధానం చెబుతున్నాడు అంటూ ఒక రేంజ్ లో పొగిడేశాడు.

Also Read: Dhamaka Review: మాస్ కంటెంట్ తో డబుల్ ధమాకా చూపించిన రవితేజ!

RELATED ARTICLES

Most Popular

న్యూస్