Sunday, January 19, 2025
Homeసినిమా'సార్‌' అంటూ వస్తున్న త‌మిళ హీరో ధనుష్

‘సార్‌’ అంటూ వస్తున్న త‌మిళ హీరో ధనుష్

Dhanush as Sir: పలు చిత్రాల నిర్మాణంతో దూసుకుపోతున్న సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ ఒక అడుగు ముందుకేసి రెండు సార్లు జాతీయ అవార్డు గెలుచుకున్న స్టార్ యాక్ట‌ర్‌ ‘ధనుష్’తో తెలుగు, తమిళంలో ద్విభాషా చిత్రాన్ని నిర్మించ‌నున్న‌ది. త‌మిళ వెర్ష‌న్‌కు ‘వాతి’, తెలుగు వెర్ష‌న్‌కు ‘సార్’ అనే టైటిల్ ఖ‌రారు చేశారు. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో ఆసక్తి రేపుతున్న ఈ సినిమా ఉత్తేజ‌భ‌రిత‌మైన‌ టైటిల్ లుక్ మోషన్ పోస్టర్‌ను  నిర్మాత‌లు ఆవిష్కరించారు.

టైటిల్ రివీల్ వీడియోలో ఈ సినిమా “యాన్ యాంబిషియ‌స్ జ‌ర్నీ ఆఫ్ ఎ కామ‌న్ మ్యాన్” అని చెప్పారు. ఈ మోష‌న్ పోస్ట‌ర్ ప్ర‌కారం ధ‌నుష్ ఒక జూనియ‌ర్ కాలేజీ లెక్చ‌ర‌ర్‌గా న‌టించ‌నున్నార‌ని తెలుస్తోంది. టైటిల్ డిజైన్‌లో పెన్నుపాళీ క‌నిపిస్తోంది. అంటే ఇది ఒక పీరియాడిక‌ల్ మూవీ అనీ, హీరో త‌న క‌లం బ‌లంతో స్టూడెంట్స్‌ కు ఒక రోల్ మోడ‌ల్ అవుతాడ‌నీ ఊహించ‌వ‌చ్చు. మొత్తంగా ఈ మోష‌న్ పోస్ట‌ర్‌ను చూస్తుంటే, ఒక ఉద్వేగ‌భ‌రిత‌మైన, ఉత్తేజ‌క‌ర‌మైన‌ క‌థ‌ను ద‌ర్శ‌క నిర్మాత‌లు మ‌న ముందు ప్రెజెంట్ చేయ‌నున్నార‌నే న‌మ్మ‌కం క‌లుగుతోంది. చిత్రం పేరుతో కూడిన ప్రచార చిత్రాలను తెలుగు, తమిళ భాషల్లో విడుదల చేశారు.

ఇదే బ్యానర్‌లో ఇటీవ‌ల‌ ‘రంగ్‌దే’ చిత్రానికి దర్శకత్వం వహించిన యూత్‌ఫుల్ డైరెక్టర్ వెంకీ అట్లూరి ఈ ప్రతిష్టాత్మక చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. సూర్యదేవర నాగవంశీ నేతృత్వంలోని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ ఈ చిత్రాన్ని శ్రీమతి సాయి సౌజన్య (ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్)తో కలిసి నిర్మిస్తున్నారు. కేరళకు చెందిన ఛార్మింగ్ సెన్సేషన్ సంయుక్తా మీనన్ ఈ చిత్రంలో కథానాయికగా ఎంపిక‌య్యారు. ‘సూదు కవ్వం’, ‘సేతుపతి’, ‘తెగిడి’, ‘మిస్టర్ లోకల్’, ‘మార’ వంటి చిత్రాలకు పనిచేసి త‌న‌దైన ముద్ర‌వేసిన‌ సినిమాటోగ్రాఫర్ దినేష్ కృష్ణన్, నేషనల్ అవార్డ్ విన్నింగ్ ఎడిటర్ నవీన్ నూలి ఈ చిత్రానికి పని చేయనున్నారు. హృద‌యాన్ని హ‌త్తుకొనే సంగీతం స‌మ‌కూర్చ‌డంలో దిట్ట అయిన జి.వి. ప్ర‌కాష్‌కుమార్ సంగీత ద‌ర్శ‌కుడు. రానున్న రోజుల్లో ఈ చిత్రానికి సంబంధించిన మ‌రిన్ని వివ‌రాలు వెల్ల‌డ‌వుతాయి. ఈ ద్విభాషా చిత్రం రెగ్యుల‌ర్ షూటింగ్ 2022 జ‌న‌వ‌రిలో మొద‌లవుతుంది.

Also Read : ఇంకా మంచి పాత్రల కోసం ఎదురుచూస్తున్నాను : అమృతా అయ్యర్

RELATED ARTICLES

Most Popular

న్యూస్