Saturday, January 18, 2025
Homeసినిమాత్వరలో ధనుష్ టాలీవుడ్ ఎంట్రీ

త్వరలో ధనుష్ టాలీవుడ్ ఎంట్రీ

కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్.. విభిన్న కథా చిత్రాల్లో నటించి ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాడు. తమిళ్ లో ధనుష్ నటించిన సినిమాలు తెలుగులోకి డబ్ అవ్వడంతో ఇక్కడ కూడా క్రేజ్ సంపాదించుకున్నాడు. ఈ కోలీవుడ్ హీరో బాలీవుడ్ లోను ఎంట్రీ ఇచ్చాడు. అక్కడ కూడా సక్సెస్ సాధించిన ధనుష్ హాలీవుడ్ లో కూడా ఎంట్రీ ఇస్తుండడం విశేషం. ఇప్పుడు ధనుష్ టాలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వనున్నారని వార్తలు వస్తున్నాయి. టాలీవుడ్ లో ఓ ప్రముఖ నిర్మాణ సంస్థ ధనుష్‌ తో సినిమా చేసేందుకు ప్లాన్ చేస్తుందని తెలిసింది.

ఎప్పటి నుంచో టాలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వాలనుకుంటున్న ధనుష్ ఓకే చెప్పారని సమాచారం. చాలా ఇంట్రస్టింగ్ స్టోరీతో రూపొందే ఈ చిత్రానికి దర్శకుడు ఎవరు..? ఈ చిత్ర నిర్మాత ఎవరు..? అనేది ప్రస్తుతానికి సస్పెన్స్. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించి ప్రీ ప్రొడక్షన్ వర్క్ కూడా స్టార్ట్ అయ్యింది అంటున్నారు. వచ్చే సంవత్సరం ఈ సినిమా సెట్స్ పైకి రానున్నట్టు సమాచారం. ఇక ధనుష్ హీరోగా నటించిన జగమే తంతిరం సినిమా ఓటీటీలో డైరెక్ట్ గా రిలీజ్ కానుంది. మరో వైపు హాలీవుడ్ మూవీ గ్రే మ్యాన్ లో ధనుష్ నటిస్తున్నారు. మరి.. కోలీవుడ్, బాలీవుడ్ లో సక్సెస్ సాధించిన ఈ కోలీవుడ్ స్టార్ టాలీవుడ్ లో కూడా సక్సస్ సాధిస్తాడేమో చూడాలి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్