Tuesday, December 3, 2024
Homeసినిమాహీరో ధనుష్ ఎక్సైట్మెంట్!

హీరో ధనుష్ ఎక్సైట్మెంట్!

 తాను ఇష్టపడే దర్శకుల్లో శేఖర్ కమ్ముల ఒకరని తమిళ స్టార్ హీరో ధనుష్ అన్నారు. ఆయనతో పని చేసేందుకు ఎదురుచూస్తున్నా అని చెప్పారు. శేఖర్ కమ్ములతో వర్కింగ్ ఎగ్జైటింగ్ గా ఉందని ట్వీట్ చేశారు. నిర్మాతలు నారాయణదాస్ నారంగ్, పి రామ్మోహన్ రావు గారి నిర్మాణంలో ఎస్వీసీ ఎల్ఎల్పీ సంస్థలో నటిచడం సంతోషంగా ఉందన్నారు ధనుష్. సినిమా ప్రారంభించేందుకు ఎదురుచూస్తున్నా అని ట్వీట్ లో పేర్కొన్నారు. దర్శకుడు శేఖర్ కమ్ముల, ధనుష్ తెలుగు తమిళ హిందీ త్రిభాషా చిత్రాన్ని శుక్రవారం అనౌన్స్ చేశారు.

ఈ సినిమా ధనుష్ కు టాలీవుడ్ లో ఫస్ట్ మూవీ కాగా, శేఖర్ కమ్ములకు బాలీవుడ్ లో ఫస్ట్ మూవీ కావడం విశేషం. త్వరలోనే ఈ మూవీ సెట్స్ మీదకు వెళ్లనుంది. ఈ కాంబినేషన్ ని ఇప్పటి వరకు ఎవరూ ఊహించలేదు. వాటే కాంబినేషన్ అనిపించే ఈ క్రేజీ మూవీలో నటించే నటీనటులు ఎవరు అనేది ఇంకా ఫైనల్ కాలేదు. ప్రస్తుతం నటీనటుల ఎంపిక జరుగుతుంది. త్వరలోనే పూర్తి వివరాలను ప్రకటించనున్నారు. మరి.. ధనుష్ ఈ సినిమాతో టాలీవుడ్ లో బిగ్ సక్సస్ సాధిస్తారని ఆశిద్దాం.

RELATED ARTICLES

Most Popular

న్యూస్