Saturday, January 18, 2025
Homeసినిమా'కుబేర' ఆ పండుగ బరిలోనే దిగనున్నాడట!

‘కుబేర’ ఆ పండుగ బరిలోనే దిగనున్నాడట!

ఇప్పుడు ఇటు టాలీవుడ్ లోను .. అటు కోలీవుడ్ లోను ఒక ప్రాజెక్టును గురించి చాలామంది చాలా ఇంట్రెస్టింగ్ గా మాట్లాడుకుంటున్నారు. అలా అందరి మధ్య చర్చల్లో నానుతున్న ఆ సినిమా పేరే ‘కుబేర’. శేఖర్ కముల దర్శకత్వం వహిస్తున్న సినిమా ఇది. సునీల్ నారంగ్ – పుస్కూర్ రామ్మోహన్ రావు నిర్మిస్తున్న ఈ సినిమా, తెలుగు .. తమిళ భాషల్లో రూపొందుతోంది. ధనుశ్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో నాగార్జున ఒక కీలకమైన పాత్రలో కనిపించనున్నారు.

ఈ సినిమా నుంచి ఇటీవల విడుదల చేసిన ధనుశ్ లుక్ .. నాగార్జున లుక్ ప్రేక్షకులలో ఆసక్తిని పెంచాయి. ఫస్టులుక్ పోస్టర్లో ధనుశ్ మాసిన బట్టలతో .. పెరిగిన గండం మీసాలతో ఫ్లాట్ ఫామ్ పై కనిపిస్తున్నాడు. టైటిల్ చూస్తే ‘కుబేర’ .. అందువల్లనే అంతా ఈ సినిమా పట్ల ఉత్కంఠను చూపుతున్నారు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ హైదరాబాదులో జరుగుతోంది. ఒక యాక్షన్ సీన్ ను ఇక్కడ షూట్ చేస్తున్నారు. ఈ ఫైట్ ఈ సినిమా హైలైట్స్ లో ఒకటిగా నిలుస్తుందని అంటున్నారు.

ధనుశ్ జోడీగా రష్మిక కనిపించనుంది. తెలుగుతో పాటు కన్నడ .. తమిళ .. హిందీ భాషల్లోను రష్మికకి మంచి క్రేజ్ ఉంది. అందువలన ఈ సినిమాకి ఆమె ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని అంటున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం ఈ సినిమాకి ప్రధానమైన బలంగా నిలుస్తుందని చెబుతున్నారు. ఈ సినిమా కంటెంట్ దీపావళి పండుగ సందర్భంతో ముడిపడి ఉంటుందట. అందువలన ఈ దీపావళికి ఈ సినిమాను రిలీజ్ చేయాలనే ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తోంది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్