Monday, March 16, 2026
Homeసినిమాధనుష్ అభిమానుల్లో ఆసక్తిని రేపుతున్న 'రాయన్' 

ధనుష్ అభిమానుల్లో ఆసక్తిని రేపుతున్న ‘రాయన్’ 

తమిళంలో వైవిధ్యభరితమైన కథలకు ఎక్కువగా ప్రాధాన్యతనిచ్చే కథానాయకుల జాబితాలో కమల్ .. విక్రమ్ తరువాత స్థానంలో ధనుశ్ కనిపిస్తాడు. కథలో కొత్తదనం ఉండాలి .. పాత్రలో వైవిధ్యం ఉండాలి .. తెరపై తాను కొత్తగా కనిపించాలి అనే పట్టుదలతో ఆయన ముందుకు వెళుతున్నాడు. ఇక తన ప్రతి సినిమాను తమిళంతో పాటు తెలుగులోను విడుదల చేస్తూ, ఇక్కడ తన మార్కెట్ కాపాడుకుంటూ వస్తున్నాడు. అలాంటి ధనుశ్ తన 50వ సినిమా పనుల్లో బిజీగా ఉన్నాడు.

ధనుశ్ 50వ సినిమాగా ‘రాయన్’ రూపొందింది. సన్ పిక్చర్స్ బ్యానర్ పై ఈ సినిమాను కళానిధి మారన్ నిర్మించాడు. ఈ సినిమాకి ధనుశ్ దర్శకత్వం వహించడం విశేషం. ఈ కథను కూడా ఆయనే తయారుచేసుకున్నాడు. డిఫరెంట్ లుక్ తో ఆయన ఈ సినిమాలో కనిపించనున్నాడు. అందుకు సంబంధించిన పోస్టర్లు ఈ సినిమాపై ఆసక్తిని పెంచుతున్నాయి. ఈ సినిమా పోస్టర్స్ చూసినవారు ఇది మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ అనుకున్నారు.

అయితే ఇది ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ తో నిర్మితమైన సినిమాఅనీ, అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చుతుందని ఈ సినిమా టీమ్ క్లారిటీ ఇచ్చింది. ఈ సినిమా ధనుశ్ కెరియర్లోనే ప్రత్యేకమైన స్థానంలో నిలుస్తుందని ఆయన అభిమానులు భావిస్తున్నారు. సంఖ్యా పరంగా ప్రత్యేకతను సంతరించుకున్న ఈ సినిమా, కొత్త రికార్డులను నెలకొల్పడం ఖాయమనే నమ్మకంతో ఉన్నారు. ప్రకాశ్ రాజ్ .. సెల్వరాఘవన్ .. ఎస్ జె సూర్య .. సందీప్ కిషన్ .. అపర్ణ బాలమురళి ముఖ్యమైన పాత్రలలో కనిపించనున్నారు. జూన్ 13వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular