Sunday, February 23, 2025
Homeసినిమా'రాయన్' .. సింహం కంటే తోడేలు ప్రమాదకరమైనది! 

‘రాయన్’ .. సింహం కంటే తోడేలు ప్రమాదకరమైనది! 

కోలీవుడ్ లో హీరోల మధ్య పోటీ బలంగా ఉంటుంది. ఒక వైపున రజనీ .. కమల్ బరిలోనే ఉన్నారు. మరో వైపున అజిత్ .. విజయ్,  ఇంకో వైపున విక్రమ్ .. సూర్య .. ఇలా గట్టిపోటీ ఉంటుంది. ఆ పోటీని తట్టుకుని నిలబడుతూ, తనకంటూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ ను .. మార్కెట్ ను సెట్ చేసుకున్న హీరోగా ధనుశ్ కనిపిస్తాడు. ఆయన తాజా చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రావడానికి ‘రాయన్’ రెడీ అవుతోంది. ఈ సినిమా కోసం ధనుశ్ అభిమానులంతా ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. ఎందుకంటే ఇది ధనుశ్ కి 50వ సినిమా.

కళానిధి మారన్ సమర్పిస్తున్న ఈ సినిమా, ఈ నెల 26వ తేదీన థియేటర్లలో దిగిపోనుంది. తమిళంతో పాటు ఇతర భాషల్లోను ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నారు. ఏఆర్ రెహ్మాన్ సంగీతం ఈ సినిమాకి ప్రత్యేకమైన ఆకర్షణగా నిలవనుందని అంటున్నారు. నిన్న ఈ సినిమా నుంచి వదిలిన ట్రైలర్, అందరిలో మరింత కుతూహలాన్ని పెంచుతోంది. ‘అడవిలో బలమైన జంతువు సింహమే అయినప్పటికీ, తోడేలు మరింత ప్రమాదకరం’ అంటూ ధనుశ్ తో సెల్వరాఘవన్ చెప్పే డైలాగ్ తో ఒక్కసారిగా హైప్ వచ్చేసింది.

ఇక ఈ సినిమాలో ధనుశ్ లుక్ కొత్తగా ఉంది. దేనికైనా తెగించినట్టుగా ఆయన బాడీ లాంగ్వేజ్ కనిపిస్తోంది. ఆయన అలా మారడానికి బాల్యంలో ఏదో ఒక బలమైన కారణం ఉందన్నట్టుగా కొన్ని విజువల్స్ కనిపిస్తున్నాయి. ఈ సినిమాలోని తారాగణం కూడా అంచనాలు పెరగడానికి మరో కారణంగా చెప్పుకోవచ్చు. ఆ జాబితాలో ప్రకాశ్ రాజ్ .. ఎస్.జె.సూర్య .. అపర్ణ బాలమురళి .. వరలక్ష్మి శరత్ కుమార్ .. సందీప్ కిషన్ కనిపిస్తున్నారు. ఈ సినిమాకి కథను కూడా ధనుశ్ అందించడం విశేషం.

RELATED ARTICLES

Most Popular

న్యూస్