Thursday, March 19, 2026
Homeసినిమాలక్ష్ చదలవాడ 'ధీర' ఫస్ట్ లుక్ రిలీజ్

లక్ష్ చదలవాడ ‘ధీర’ ఫస్ట్ లుక్ రిలీజ్

‘వలయం’ సినిమాతో  పరిచయమైన హీరో లక్ష్ చదలవాడ  ‘గ్యాంగ్‌స్టర్ గంగరాజు’ సినిమాతో విమర్శకుల ప్రశంసలందుకున్నారు. ఇప్పుడు అదే జోష్ లో ‘ధీర’ అనే డిఫరెంట్ కాన్సెప్ట్ తో యాక్షన్ మోడ్‌లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. అన్ని వర్గాల ప్రేక్షకులు కోరుకునే ఆసక్తికర సన్నివేశాలతో ఈ సినిమాను గ్రాండ్ గా రూపొందిస్తున్నారు.

విక్రాంత్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను చదలవాడ బ్రదర్స్ సమర్పణలో శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర బ్యానర్ పై నిర్మిస్తున్నారు. ఓ వైపు షూటింగ్ చేస్తూనే మరోవైపు చిత్ర ప్రమోషన్స్ పై ఫోకస్ పెట్టిన దర్శకనిర్మాతలు.. ఎప్పటికప్పుడు తమ చిత్రానికి ఆడియన్స్ కనెక్ట్ అయ్యే అప్‌డేట్స్ వదులుతూ సినిమా పై హైప్ పెంచేస్తున్నారు.  ఈ క్రమంలోనే తాజాగా హీరో లక్ష్ చదలవాడ పుట్టినరోజు కానుకగా ఈ ధీర మూవీ ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు మేకర్స్. ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉందని, 2023లో ఈ సినిమాను రిలీజ్ చేయనున్నాం అని తెలిపారు మేకర్స్.

పలు సూపర్ హిట్ సినిమాలకు సంగీతం అందించిన సాయి కార్తీక్ ఈ సినిమాకు బాణీలు కడుతున్నారు. ధీర సినిమాకు సంబంధించి ఇప్పటివరకు వచ్చిన అన్ని అప్ డేట్స్ సూపర్ రెస్పాన్స్ అందుకున్నాయి. దీంతో సినిమా విజయంపై నమ్మకంగా ఉన్నారు దర్శకనిర్మాతలు. ఈ చిత్రంలో లక్ష్ చదలవాడ, నేహా పతన్, సోన్యా భన్సాల్, మిర్చి కిరణ్, హిమజ, నవీన్ నేని, భరణి శంకర్, సామ్రాట్, బాబీ బేడీ, వైవా రాఘవ్, భూషణ్, మేక రామకృష్ణ, సంధ్యారాణి తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular