Sunday, January 19, 2025
Homeసినిమాపట్టుదలతో ప్రమాదం వైపు వెళ్లిన ఓ జర్నలిస్టు కథనే 'దూత'

పట్టుదలతో ప్రమాదం వైపు వెళ్లిన ఓ జర్నలిస్టు కథనే ‘దూత’

నాగచైతన్య ఒక సినిమా తరువాత ఒకటిగా చేసుకుంటూ వెళుతున్నాడు. ప్రస్తుతం ఆయన చేతిలో గట్టి ప్రాజెక్టులే ఉన్నాయి. ఈ నేపథ్యంలో మొదటిసారిగా ఆయన వెబ్ సిరీస్ ల దిశగా మొదటి అడుగు వేశాడు. ప్రస్తుతం చేస్తున్న సినిమాల మధ్యలోనే ఆయన ‘దూత’ అనే వెబ్ సిరీస్ ను పూర్తి చేశాడు. విక్రమ్ కుమార్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాకి, శరత్ మరార్ నిర్మాతగా వ్యవహరించాడు. సూపర్ నేచురల్ థ్రిల్లర్ జోనర్ లో ఈ సిరీస్ నడుస్తుంది. డిసెంబర్ 1వ తేదీ నుంచి ‘అమెజాన్ ప్రైమ్’ లో ఈ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది.

కథ విషయానికి వస్తే ఇది ఒక జర్నలిస్ట్ చేసే సాహసంగా చెప్పుకోవచ్చు. ఈ కథలో చైతూ ‘సాగర్’ అనే జర్నలిస్ట్ పాత్రను పోషించాడు. వివాదాలు .. ప్రమాదాలు తనకి కొత్తకాదు అన్నట్టుగా సాగర్ దూకుడు గానే ముందుకు వెళుతుంటాడు. నీతి .. నిజాయితితో పాటు, వాటి కోసం పోరాడే ధైర్యవంతుడు అతను. అలాంటి సాగర్ ను ఆ సిటీలో జరుగుతున్న మర్డర్లు ఆలోచనలో పడేస్తాయి. అసలు ఈ హత్యలు ఎవరు చేస్తున్నారు? ఎందుకు చేస్తున్నారు? అనే విషయాన్ని కనుక్కోవాలనుకుంటాడు.

మర్డర్లు జరుగుతున్న తీరుపై దృష్టి పెట్టిన సాగర్, జరుగుతున్న మర్డర్ లకు .. ఆ రోజున  ఓ దిన పత్రికలో వచ్చే కార్టూన్ కి ఏదో సంబంధం ఉందని అర్థమవుతుంది. దాంతో ఆ సీక్రెట్ ను ఛేదించడానికి రంగంలోకి దిగుతాడు. అప్పటి నుంచి అతనికి కొన్ని అనూహ్యమైన సంఘటనలు ఎదురుకావడం మొదలవుతుంది. తాను అనుకున్నంత తేలికగా ఈ విషయంలో ముందుకు వెళ్లడం కష్టమేననే సంగతి అతనికి అర్థమైపోతుంది. అయినా పట్టుదలతో ముందుకు వెళతాడు. ఫలితంగా ఆయన ఎలాంటి చిక్కుల్లో పడతాడనే మలుపులతో ఈ సిరీస్ నడుస్తుంది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్