Saturday, November 23, 2024
HomeTrending Newsబాధ్యత లేదా?: ధూళిపాళ

బాధ్యత లేదా?: ధూళిపాళ

డ్రగ్స్ వ్యవహారంలో రాష్ట్ర డిజిపి తన బాధ్యతను పూర్తిగా విస్మరించారని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత ధూళిపాళ నరేంద్ర ఆరోపించారు. శాంతిభద్రతలు కాపాడాల్సిన కీలకస్థానంలో ఉన్న వ్యక్తి మొత్తం వ్యవహారంపై సమగ్ర దర్యాప్తు చేయకుండా వెంటనే హడావుడిగా ప్రకటన చేయడం ఏమిటని ప్రశ్నించారు. డ్రగ్స్ మూలాలు కనుక్కోవాల్సిన వాళ్ళే తప్పుదోవ పట్టించే విధంగా మాట్లాడడం పట్ల నరేంద్ర విస్మయం వ్యక్తం చేశారు.

ముంద్రా పోర్టులో సింగల్ కన్సైన్మెంట్ లో 9,500 కోట్ల రూపాయల విలువ చేసే డ్రగ్స్ పట్టుబడితే దీన్ని చాలా చిన్న విషయంగా ముఖ్యమంత్రి తీసుకోవడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. సిఎం జగన్ కూడా వెంటనే స్పందించకుండా రెండు వారాల తర్వాత నిన్నటి రోజున దీనిపై సమీక్షించడంలో ఆంతర్యం ఏమిటో చెప్పాలన్నారు. ఆంధ్ర ప్రదేశ్ గంజాయికి, డ్రగ్స్ కు అడ్డాగా మారిన మాట వాస్తవం కాదా అని ప్రభుత్వాన్ని అడిగారు. దేశంలో ఎక్కడ గంజాయి దొరికినా దాని మూలాలు ఏపీలో ఉంటున్నాయని అయన ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గంజాయి సాగు విపరీతంగా పెరిగిందని, దాదాపు 15 వేల ఎకరాల్లో సాగవుతోందని, దీనిలో అధికార పార్టీ నేతల హస్తం ఉందని నరేంద్ర పేర్కొన్నారు. గంజాయి సాగు, రవాణా అధికార వైఎస్సార్సీపీ నేతల కనుసన్నల్లోనే జరుగుతోందని ధూళిపాళ అన్నారు.

గతంలో ఎక్కడైనా గంజాయి, నాటుసారా మూలాలు కనబడితే వెంటనే ఎక్సైజ్ శాఖ అధికారులు దాడి చేసేవారని, గంజాయి సాగు చేసే తోటలను ధ్వంసం చేసేవారని నరేంద్ర గుర్తు చేశారు. ఈ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా ఎక్సైజ్ శాఖను నిర్వీర్యం చేసి స్పెషల్ ఎన్ఫోర్స్ మెంట్ బ్యూరో ఏర్పాటు చేసిందని అన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్