Sunday, January 19, 2025
Homeసినిమాదిల్ రాజు న‌మ్మ‌కం నిజ‌మౌతుందా?

దిల్ రాజు న‌మ్మ‌కం నిజ‌మౌతుందా?

will Sentiment workout? దిల్ రాజు తన సోదరుడి తనయుడైన ఆశిష్ రెడ్డిని హీరోగా పరిచయం చేస్తూ నిర్మించిన చిత్రం రౌడీ బాయ్స్. సంక్రాంతి కానుక‌గా ఈ నెల 14వ తేదీన రౌడీ బాయ్స్ చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుక‌కు మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చరణ్ చీఫ్ గెస్టుగా హాజరయ్యారు. ఈ వేడుకలో దిల్ రాజు .. జై చరణ్ .. జై జై చరణ్ అంటూ స్టేజ్ పైకి వచ్చారు. దాంతో మెగా అభిమానులంతా ఈలలు .. గోలలు చప్పట్లుతో వేదిక మారుమ్రోగింది.

ఈ సంద‌ర్భంగా నిర్మాత‌ దిల్ రాజు మాట్లాడుతూ… ముందుగా మెగా పవర్ స్టార్ చరణ్ గారికి థ్యాంక్స్ చెబుతున్నాను. ఈ ఈవెంట్ గురించి ఆయన గోవా నుంచి వచ్చారు. ఇక ఈ సినిమాకి పనిచేసిన వాళ్లందరికీ కూడా నేను థ్యాంక్స్ చెబుతున్నాను. దిల్ సినిమా చేస్తున్నప్పుడు సక్సెస్ కావాలి .. అయింది. రెండవ సినిమా ఆర్య చేస్తున్నప్పుడు హిట్ కొట్టాలి .. హిట్ అయింది. రెండు సినిమాలు పూర్తయిన తరువాత హ్యాట్రిక్ హిట్ కొట్టాలి అనుకున్నాము. భద్ర సినిమాతో హ్యాట్రిక్ హిట్ కొట్టాం.

అలా వరుస సక్సెస్ లతో వెళుతున్నప్పుడు చైతూ ‘జోష్’ మూవీ అంతగా ఆడలేదు. ఓవర్ కాన్ఫిడెన్స్ తో వెళ్లడం వలన అలా జరిగింది. అప్పుడు రియలైజ్ కావడం జరిగింది. ఆ తరువాత బృందావనం .. మిస్టర్ పెర్ఫెక్ట్ తో మళ్లీ సక్సెస్ లు వచ్చాయి. ఆ తరువాత మళ్లీ ఒక ఫ్లాప్ .. ఇలా అప్ అండ్ డౌన్స్ వస్తూనే ఉన్నాయి. ‘శతమానం భవతి’ నుంచి ‘ఎంసీఏ’ వరకూ మా దర్శకులు సిక్స్ సూపర్ హిట్స్ ఇచ్చారు. ఆ ఆరుగురు దర్శకులకు మళ్లీ నేను థ్యాంక్స్ చెబుతున్నాను.

2019లో ఆశిష్ ను హీరోను చేయాలనుకున్నాము. హర్ష దర్శకత్వంలో యూత్ ఫుల్ కంటెంట్ తో సెట్స్ పైకి వెళ్లాము. తీస్తున్నాము .. కోవిడ్  రాగానే ఆపుతున్నాము. మా ముందున్నది ఒకటే గోల్ .. ఈ సినిమా హిట్ కొట్టాలి. ఇంత వరకూ ఐదు సంక్రాంతులు ఎలా హిట్లు కొట్టామో ఆరో సంక్రాంతికి కూడా ఈ సక్సెస్ ఫుల్ సినిమాతో డబుల్ హ్యాట్రిక్ హిట్ కొట్టాలని అనుకుంటున్నాము. ఈ సంక్రాంతి మాదేనని అనిపించుకుంటామనే నమ్మకంతో ఉన్నాం… అన్నారు.

మ‌రి.. దిల్ రాజు న‌మ్మ‌కం నిజ‌మౌతుందో లేదో చూడాలి.

Also Read : ఎన్టీఆర్ చేతుల మీదుగా ‘రౌడీ బాయ్స్’ ట్రైలర్

RELATED ARTICLES

Most Popular

న్యూస్