Saturday, January 18, 2025
HomeసినిమాGame Changer: 'గేమ్ ఛేంజర్' గురించి టెన్షన్ పడుతున్న దిల్ రాజు

Game Changer: ‘గేమ్ ఛేంజర్’ గురించి టెన్షన్ పడుతున్న దిల్ రాజు

రామ్ చరణ్‌, శంకర్ కాంబినేషన్లో రూపొందుతోన్న భారీ పాన్ ఇండియా మూవీ ‘గేమ్ ఛేంజర్’. ఈ భారీ చిత్రాన్ని దిల్ రాజు అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఇందులో చరణ్ కు జంటగా కైరా అద్వానీ నటిస్తుంది. శ్రీకాంత్, సునీల్, అంజలి కీలక పాత్రలు పోషిస్తుంటే.. విలన్ పాత్రలో ఎస్.జె.సూర్య నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతుంది. ఓ వైపు ‘ఇండియన్ 2’ షూటింగ్ చేస్తూ.. మరో వైపు గేమ్ ఛేంజర్ షూటింగ్ చేస్తున్నారు డైరెక్టర్ శంకర్.

ఈ మూవీ నుంచి మాస్ సాంగ్ ఆడియో లీకైంది. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఈ సాంగ్ గేమ్ ఛేంజర్ మూవీలోనిదే  అని.. ఈ సాంగ్ కోసం ఏకంగా 15 కోట్లు ఖర్చుపెట్టారని టాక్ వినిపిస్తోంది. ఈ సాంగ్ లీకవ్వడంతో చరణ్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. దీంతో గేమ్ ఛేంజర్ మేకర్స్ ఇది షాక్ అని చెప్పచ్చు. ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ.. ఇలా లీక్ అవుతుండడంతో మేకర్స్ టెన్షన్ పడుతున్నారు. అయితే.. ఈ సాంగ్ లీకవ్వడంతో మేకర్స్ పోలీసులకు కంప్లైట్ చేయడం జరిగింది.  సినిమా నిర్మాణం టైమ్ లో ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ.. ఇలా లీక్ అవుతుండడం బాధాకరం అని చెప్పచ్చు.

ఎన్నో కోట్లు ఖర్చు పెట్టి సినిమాలు తీస్తుంటే.. ఇలా లీక్ అవ్వడం వలన నిర్మాతకు నష్టం వస్తుంది. ఇక నుంచి ఇలా జరగకుండా ఉండేందుకు కఠిన చర్యలు తీసుకోవాలి అని సినీ పండితులు అంటున్నారు. ఈ సాంగ్ లీక్ అవ్వడం.. షూటింగ్ ఇంకా పూర్తి కాకపోవడం.. ఎప్పుడు పూర్తవుతుందో క్లారిటీ లేకపోవడంతో దిల్ రాజు టెన్షన్ పడుతున్నారని వార్తలు వస్తున్నాయి. ఇక ఈ సినిమా రిలీజ్ డేట్ పై సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. మరి.. శంకర్ ఎప్పుడు క్లారిటీ ఇస్తారో చూడాలి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్