Saturday, March 14, 2026
Homeసినిమా‘పంచనామ’ ఫస్ట్ లుక్ రిలీజ్ విడుదల

‘పంచనామ’ ఫస్ట్ లుక్ రిలీజ్ విడుదల

Panchanama:
త్రిపుర నిమ్మగడ్డ, వెంప కాశీ, సంజీవ్ జాధవ్, ముక్కు అవినాష్ ప్ర‌ధాన పాత్ర‌లు పోషించిన చిత్రం ‘పంచ‌నామ‌’. ఈ చిత్రాన్ని గద్దె శివకృష్ణ, వెలగ రాము సంయుక్తంగా నిర్మించారు. హార్దిక్ క్రియేషన్స్ బ్యానర్ పై సిగటాపు రమేష్ నాయుడు దర్శకత్వంలో రూపొందుతోంది. త్వ‌ర‌లో ఈ చిత్రం ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చేందుకు రెడీ అవుతుంది. ఈ సంద‌ర్భంగా ఈ పంచనామ టైటిల్ ను స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు చేతుల మీదగా విడుదల చేశారు.

దర్శకుడు రమేష్ నాయుడు మాట్లాడుతూ “ఈ కథ విని నన్నునమ్మి ఈరోజు మీ ముందుకు తీసుకొచ్చిన మా నిర్మాత‌కు థ్యాంక్స్ తెలియ‌చేస్తున్నాను. ఇది ఒక వినూత్న‌మైన క‌థ‌. ప్రేక్ష‌కులు అందరికీ నచ్చుతుందని నమ్ముతున్నాం. ప్రేక్షకులు కూడా ఆదరిస్తారని ఆశిస్తున్నాం. అలాగే ఈ చిత్రంలో నటించిన నటీనటులు అందరూ వారి పాత్రలకు న్యాయం చేశారు. ఈ చిత్రం కోసం పని చేసిన సాంకేతిక వర్గానికి పేరు పేరునా ధన్యవాదాలు తెలియజేస్తున్నా” అన్నారు.

నిర్మాతలు మాట్లాడుతూ “ఈ చిత్రాన్నికథలోని ఇంటెన్సిటీ తగ్గకుండా జనాదరణ పొందే విధంగా నిర్మాణ విలువలతో నిర్మించటం జరిగింది. ఇది ఖ‌చ్చితంగా ప్రేక్షకాదరణ పొందే చిత్రమవుతుందని ఆ విషయం ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ తో అర్థమైంది. త్వరలోనే మీ ముందుకు తీసుకొస్తాం” అన్నారు.

Also Read : ‘అఖండ‌’కు అనూహ్య స్పంద‌న‌

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular