Sunday, January 19, 2025
Homeసినిమాఎన్టీఆర్, శంక‌ర్ కాంబినేష‌న్ సెట్ చేస్తున్న దిల్ రాజు..?

ఎన్టీఆర్, శంక‌ర్ కాంబినేష‌న్ సెట్ చేస్తున్న దిల్ రాజు..?

Shankar-NTR: మెగాప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌, సెన్సేష‌న‌ల్ డైరెక్ట‌ర్ శంక‌ర్ కాంబినేష‌న్లో భారీ పాన్ ఇండియా మూవీ రూపొందుతోన్న విష‌యం తెలిసిందే. ఈ భారీ పాన్ ఇండియా మూవీని టాలీవుడ్ టాప్ ప్రొడ్యూస‌ర్ దిల్ రాజు నిర్మిస్తున్నారు. ఇది చ‌ర‌ణ్ 15వ చిత్రం కాగా దిల్ రాజు 50వ చిత్రం. ప్ర‌స్తుతం ఈ మూవీ శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటుంది. ఈ సినిమాలో రామ్‌చరణ్ ఎన్నికల కమీషనర్‌గా, ఐఎయస్ అధికారిగా కనిపిస్తాడని ఇది వరకు వార్తలొచ్చాయి.

ఇదిలా ఉంటే.. రామ్ చరణ్‌తో సినిమా పూర్తయిన వెంటనే.. శంకర్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో కూడా ఓ సినిమా చేయ‌నున్నాడ‌ని వార్తలొస్తున్నాయి. చ‌ర‌ణ్ కి శంక‌ర్ షూటింగ్ టైమ్ లో ఓ క‌థ చెబితే అది ఎన్టీఆర్ కు బాగుంటుంద‌ని చెప్పాడ‌ట‌. వెంట‌నే ఎన్టీఆర్ కు చ‌ర‌ణే శంక‌ర్ తో క‌థ చెప్పించాడ‌ని.. ఎన్టీఆర్ కు క‌థ న‌చ్చి చేస్తాన‌ని మాట ఇచ్చార‌ని వార్త‌లు వ‌చ్చాయి. ఈ చిత్రానికి కూడా దిల్ రాజే నిర్మాత అని స‌మాచారం.

ఇటీవ‌ల‌ షూటింగ్ సమయంలోనే దిల్ రాజుకు కూడా శంకర్ క‌థ వినిపించార‌ట‌. అది దిల్ రాజు కు బాగా నచ్చిందని, ఆ కథతోనే ఎన్టీఆర్ హీరోగా శంక‌ర్ డైరెక్ష‌న్ లో ఓ సినిమాను దిల్ రాజు నిర్మించబోతున్నట్టుగా టాక్ వినిపిస్తోంది. ఈ కాంబో ఖచ్చితంగా సెట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మ‌రి.. చ‌ర‌ణ్ తో చేస్తున్న మూవీ రిలీజ్ త‌ర్వాత ఎన్టీఆర్, శంక‌ర్ మూవీని అనౌన్స్ చేస్తారేమో చూడాలి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్