Tuesday, March 10, 2026
Homeసినిమా‘అల్లంత దూరాన’ మోషన్ పోస్టర్ ఆవిష్కరించిన బాబి

‘అల్లంత దూరాన’ మోషన్ పోస్టర్ ఆవిష్కరించిన బాబి

గతంలో బాలనటుడిగా, ఆ తర్వాత హీరోగా తానేంటో నిరూపించుకున్న విశ్వ కార్తికేయ తాజాగా నటించిన చిత్రం ‘అల్లంత దూరాన’ ఇందులో ఆయనకు జోడీగా ప్రముఖ నటి ఆమని మేనకోడలు హ్రితిక శ్రీనివాసన్ నటించింది. చలపతి పువ్వల దర్శకత్వం వహించారు. ఆర్.ఆర్. క్రియేటివ్ కమర్షియల్ పతాకం పై శ్రీమతి కోమలి సమర్పణలో నిర్మాత ఎన్. చంద్రమోహనరెడ్డి తెలుగు, తమిళ భాషలలో నిర్మిస్తున్నారు. కాగా ఈ చిత్రం మోషన్ పోస్టర్ ను హైదరాబాద్ లో జరిగిన కార్యక్రమంలో ప్రముఖ దర్శకుడు బాబి (కె.ఎస్. రవీంద్ర) విడుదల చేశారు.

అనంతరం దర్శకుడు బాబి మాట్లాడుతూ.. “మోషన్ పోస్టర్ చాలా బావుంది. మంచి విజువల్స్, మెలోడీ మ్యూజిక్ సమ్మేళనంతో ప్రేక్షకులను అలరించే సినిమాగా అనిపిస్తోంది. దర్శక, నిర్మాతలతో పాటు చిత్ర బృందానికంతటికీ శుభాభినందనలు తెలియజేస్తున్నా” అన్నారు. ఇక ఈ చిత్రం మోషన్ పోస్టర్ ను చూసిన ప్రముఖ దర్శక, నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ చాలా బావుందంటూ ప్రశంసిస్తూ… చితబృందానికి శుభాశీస్సులు అందజేశారు.

చిత్ర దర్శకుడు చలపతి పువ్వల మాట్లాడుతూ.. “ఫీల్ గుడ్ లవ్ స్టోరీ  చిత్రమిది. నాకు స్ఫూర్తిని కలిగించిన దర్శకులలో బాబి గారు ఒకరు. ఆయన చేతుల మీదుగా మోషన్ పోస్టర్ విడుదల కావడం ఆనందంగా ఉంది. మా మోషన్ పోస్టర్ ను చూసి అభినందించిన భరద్వాజ గారికి కృతజ్ఞతలు” అన్నారు.

హీరో విశ్వ కార్తికేయ మాట్లాడుతూ.. “జమ్మూకాశ్మీర్ షూటింగ్ లో ఉన్న కారణంగా నేను మోషన్ పోస్టర్ విడుదలకు హాజరు కాలేకపోయాను” అంటూ ఓ వీడియో విజువల్ ను షేర్ చేశారు. “లోగడ ఇదే దర్శకుడితో ‘కళాపోషకులు’ చిత్రాన్ని చేశాను. మంచి విజన్ ఉన్న దర్శకుడు, అభిరుచి కలిగిన నిర్మాతతో మెలో డ్రామా చిత్రాన్ని చేయడం సంతోషంగా ఉంది. రధన్ సంగీతం, కళ్యాణ్ ఛాయాగ్రహణం చిత్రాన్ని మరో స్థాయిలో నిలబెడతాయి” అని అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular