Saturday, January 18, 2025
HomeసినిమాRC16: చరణ్‌ సినిమా కోసం ఆఫీస్ ప్రారంభం

RC16: చరణ్‌ సినిమా కోసం ఆఫీస్ ప్రారంభం

రామ్ చరణ్‌ హీరోగా డైరెక్టర్ బుచ్చిబాబు ఓ సినిమాను తెరకెక్కించనున్న విషయం తెలిసిందే. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్ సంస్థ నిర్మించనుంది. ఈ సినిమాను ఎప్పుడో అనౌన్స్ చేశారు. కథ కూడా రెడీ అయ్యింది. ఈ కథను తెరకెక్కించడానికి బుచ్చిబాబు కూడా రెడీగా ఉన్నాడు. అయితే.. చరణ్.. శంకర్ తో చేస్తున్న ‘గేమ్ ఛేంజర్’ మూవీ షూటింగ్ లో బిజీ అవ్వడం వలన ఈ సినిమా ఆలస్యం అయ్యింది. ఇప్పుడు ఈ సినిమాను సెట్స్ పైకి తీసుకువచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. డిసెంబర్ లేదా జనవరి నుంచి ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ చేయనున్నారు.

అందుకనే ఇప్పుడు ఈ సినిమా కోసం మేకర్స్ కొత్త ఆఫీస్ ప్రారంభించారు. దీనికి సంబంధించిన ఫోటో బయటకు వచ్చింది. క్రియేటీవ్ డైరెక్టర్ సుకుమార్ కొబ్బరి కాయ కొట్టి పూజలు నిర్వహించారు. ఇది భారీ స్పోర్ట్స్ డ్రామా అని.. ఇందులో క్యారెక్టర్ చాలా రియలిస్టిక్ గా ఉంటాయని బుచ్చిబాబు చెప్పారు. అలాగే ఈ సినిమా కథ శ్రీకాకుళం, వైజాగ్, రాజమండ్రి బ్యాక్ డ్రాప్ లో జరుగుతుందని సమాచారం. ఇందులో డైలాగ్స్ ఉత్తరాంధ్ర యాసలో ఉంటాయట. అందుకనే డైలాగ్స్ కోసం లోకల్ రైటర్ ను తీసుకున్నారని కూడా వార్తలు వస్తున్నాయి. నాలుగు సంవత్సరాలు ఈ కథ పై బుచ్చిబాబు వర్క్ చేశాడు. మరి.. చరణ్ తో ఏ రేంజ్ సక్సెస్ సాధిస్తాడో చూడాలి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్