Saturday, January 18, 2025
Homeసినిమాసూర్యతో డిఫరెంట్ మూవీ ప్లాన్ చేస్తున్న చందూ

సూర్యతో డిఫరెంట్ మూవీ ప్లాన్ చేస్తున్న చందూ

కార్తికేయ సినిమాతో కెరీర్ స్టార్ట్ చేసి తొలి ప్రయత్నంలోనే సక్సెస్ సాధించి అందరి దృష్టిని ఆకట్టుకున్నాడు చందు మొండేటి. ఆతర్వాత నాగచైతన్యతో ప్రేమమ్ చిత్రాన్ని తెరకెక్కించి సక్సెస్ సాధించాడు. ఆతర్వాత సవ్యసాచి సినిమాతో మెప్పించలేకపోయినా.. ఈమధ్య కార్తికేయ 2 సినిమాతో పాన్ ఇండియా రేంజ్ లో బ్లాక్ బస్టర్ సాధించి సెన్సేషన్ క్రియేట్ చేశాడు. ప్రస్తుతం నాగచైతన్యతో ఓ విభిన్న ప్రేమకథా చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. గీతా ఆర్ట్స్ బ్యానర్ లో అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. త్వరలో ఈ సినిమా సెట్స్ పైకి రానుంది.

అయితే.. ఈ సినిమా తర్వాత చందూ.. కోలీవుడ్ స్టార్ సూర్యతో సినిమా చేయనున్నాడు. ఈ విషయాన్ని చందూ ఓ ఇంటర్ వ్యూలో బయటపెట్టాడు. ఇంతకీ ఏం చెప్పాడంటే.. నాలుగు వేదాలైన ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అధర్వ వేదం చుట్టూ తిరుగుతూ సాగె సోషియో జానర్ లో ఈ మూవీ ఉంటుందని చెప్పాడు. ప్రస్తుతం సూర్య పలు కమిట్మెంట్స్ తో ఉన్నారని, అవి పూర్తి అయిన అనంతరం రానున్న రెండేళ్లలో తామిద్దరి కాంబో మూవీ రానుందని చెప్పారు. ఈ సినిమా భారీగా ఉంటుందని.. అంతకు మించి ఈ మూవీ గురించి మరేమి చెప్పలేనన్నారు.

సూర్య ఎప్పటి నుంచో తెలుగులో సినిమా చేయాలి అనుకుంటున్నారు కానీ ఇప్పటి వరకు సెట్ కాలేదు. ఈసారి తెలుగులో సినిమా చేయాలని ఫిక్స్ అయ్యారట. చందూ చెప్పిన స్టోరీ బాగా నచ్చడంతో సూర్య ఓకే చెప్పారట. అయితే.. ఎప్పుడు స్టార్ట్ కానుంది.? ఏ బ్యానర్ లో ఈ సినిమా ఉంటుంది..? అనేది తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.

RELATED ARTICLES

Most Popular

న్యూస్