Saturday, January 18, 2025
Homeసినిమా'టెనెంట్' అక్కడే దెబ్బకొట్టేసింది!

‘టెనెంట్’ అక్కడే దెబ్బకొట్టేసింది!

సత్యం రాజేశ్ ఒక వైపున కీలకమైన పాత్రలను చేస్తూనే, హీరోగా వచ్చిన అవకాశాలను కూడా ఉపయోగించుకుంటూ వెళుతున్నాడు. ఆయన కథానాయకుడిగా రూపొందిన ‘టెనెంట్’ నిన్ననే థియేటర్లకు వచ్చింది. చంద్రశేఖర్ రెడ్డి నిర్మించిన ఈ సినిమాకి యుగంధర్ దర్శకత్వం వహించాడు. మేఘ చౌదరి – చందన – భరత్ కాంత్ ముఖ్యమైన పాత్రలలో కనిపిస్తారు. ఇది చిన్న సినిమానే అయినప్పటికి, ట్రైలర్ రిలీజ్ చేసిన తరువాత, చాలామందిలో ఆసక్తిని పెంచింది.

కథ విషయానికి వస్తే .. గౌతమ్ ఒక సాఫ్ట్ వేర్ సంస్థలో పనిచేస్తూ ఉంటాడు. అతనికి మరుదలు సంధ్యతో వివాహం జరుగుతుంది. ఇద్దరూ కూడా చాలా హ్యాపీగా రోజులు గడుపుతూ ఉంటారు. ఇక మరో వైపున మరో జంటగా కనిపించే భరత్ – శ్రావణి ప్రేమించుకుంటారు. తమ ప్రేమను పెళ్లివరకూ తీసుకుని వెళ్లాలనే ఆలోచనలో వాళ్లు ఉంటారు. అదే సమయంలో హీరోకి సంధ్యపై అనుమానం కలుగుతుంది. ఆ అనుమానం పెనుభూతంగా మారుతుంది. ఆ నేపథ్యంలో ఒక రోజున ఆమెను అతను హత్య చేస్తాడు.

ఇక మరో వైపున రిషి – శ్రావణి ఇద్దరూ కూడా తమ ప్రేమకి ఈ సమాజం అడ్డుగోడగా ఉందని భావించి ఒక బిల్డింగ్ పై నుంచి దూకేస్తారు. ఆ తరువాత ఏం జరుగుతుందనేది కథ. ఒక వైపున పెళ్లైన జంట .. మరో వైపున ప్రేమలో ఉన్న జంట. ఈ రెండు జంటల మధ్య కథ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుందనే ట్రైలర్ చూసినవారు అనుకుంటారు. కానీ అంతటి ఆసక్తికరంగా కథను చెప్పడంలో దర్శకుడు విఫలమయ్యాడు. నిదానంగా సాగే స్క్రీన్ ప్లే .. పస లేని సన్నివేశాలు ఆడియన్స్ కి నిరాశను కలిగిస్తాయి. కథపై మరింత కసరత్తు చేసి ఉంటే బాగుండేదనిపిస్తుంది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్